మొగిలిపాక గ్రామంలో బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం
యాదాద్రి భువనగిరి జిల్లా ప్రతినిధి జనం సాక్షి న్యూస్ సెప్టెంబర్ 10 వలిగొండ మండల పరిధిలోని మొగిలిపాక గ్రామంలో బొడ్రాయి ముత్యాలమ్మ తల్లి కళ్యాణ మహోత్సవం సర్పంచ్ ముద్దసాని శశికళ రెడ్డి మాజీ మచ్చ గిరి గుట్ట చైర్మన్ కిరణ్ రెడ్డి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా నిర్వహించారు ఇందులో భాగంగా శ్రీ శ్రీ శ్రీ మల్లికార్జున గొర్రెల మేకల కాపరులయాదవ సంఘం నిర్మాణము కోసము రాజ్యసభ సభ్యులు లింగ యాదవ్ నిధులనుండి 10 లక్షల రూపాయలు యాదాద్రి భువనగిరి స్థానిక ఎమ్మెల్యే శేఖర్ రెడ్డి ఆదేశానుసారము మంజూరు చేశామని
రాజ్యసభ సభ్యులు బడుగు లింగ యాదవ్ రాష్ట్ర గొర్రె మేకలకాపరుల సంఘం రాష్ట్ర చైర్మన్ దూదిమెట్ల బాలరాజు యాదవ్ తెలిపారు ఆదివారం మొగిలి పాక గ్రామంలో భూమి పూజచేసి శంకుస్థాపన చేశారు ని. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం భారతదేశంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆధ్వర్యంలో రోల్ మోడల్ గా మారుతుందని అన్నారు రాష్ట్రంలో ఎన్నికలు రాగానే కాంగ్రెస్ బిజెపి పార్టీలు ప్రభుత్వం ఏర్పాటు చేస్తామని పగటి కలలు కంటున్నారు మూడోసారి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా కెసిఆర్ ను రాష్ట్ర ప్రజలు చూడాలని నిర్ణయించుకున్నారని కెసిఆర్ అమలు చేసిన పథకాలు ప్రజలకు చేరువలో ఉన్న వి.అభివృద్ధి ఫలాలు అందుతున్నాయని ప్రతి ఇంటికి కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ రైతుబంధు దళిత బంధు బీసీ బందు రైతు బీమా పథకాలు ప్రజలకు అందుబాటులోకి తెచ్చారని వారు అన్నారు 2024 లో కూడా తెలంగాణ రాష్ట్రంలో బి ఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుందని ఆయన ఇతవు పలికారు ఈ కార్యక్రమంలో బి ఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు చుక్కల సత్తయ్య జడ్పిటిసి ఒకటి పద్మ అనంతరెడ్డి మండల పార్టీ అధ్యక్షులు తుమ్మల వెంకటరెడ్డి గొర్రె కాపరుల సంఘం జిల్లా డైరెక్టర్ దేశ బోయిన సూర్యనారాయణ పట్టణ అధ్యక్షులు ఎంఓ లింగస్వామి ముగిపాక గ్రామ గొర్రె కాపుల సంఘం అధ్యక్షులు పెద్ద గొల్ల మాజీ సర్పంచ్ శంకరయ్య మాజీ ఎంపీటీసీ మల్లేష్ మండల నాయకులు కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.