ఇబ్రహీంపట్నం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే టికెట్ రెసులో కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్
ఇబ్రహీంపట్నం, సెప్టెంబర్10(జనంసాక్షి):-
గత 30సవంత్సరాల నుండి కాంగ్రెస్ పార్టీ కోసం అహర్నిశలు కృషి చేస్తున్న కురుమ సామాజిక వర్గానికి చెందిన కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో రంగారెడ్డి జిల్లా లోని హయత్ నగర్ మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు గా, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి గా, ప్రస్తుతం టిపిసిసి కార్యదర్శి గా, టిపిసిసి ప్రచార కమిటీ సభ్యలు గా కొనసాగుతున్నారు గతంలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అప్పటి శాసన సభ్యులు సుదీర్ కుమార్, మల్ రెడ్డి రంగారెడ్డి, తెలంగాణ ఏర్పాటు తరువాత 2013లో ఇబ్రహీంపట్నం లో పొటీ చేసిన క్యామ మల్లేష్,ఆ తరువాత పొత్తులో భాగంగా ఇబ్రహీంపట్నం లో పార్టీ ఆదేశాల మేరకు సపోర్ట్ చేయడం జరిగింది కొంతమంది తమ స్వార్థం కోసం పార్టీలు మారిన నేపథ్యంలో ఒకే పార్టీ ఒకే సిద్ధాంతంతో గత 30 సంవత్సరాల నుండి పార్టీకి సేవ చేస్తున్న కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ కి కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయిస్తే ఇబ్రహీంపట్నం లో కాంగ్రెస్ పార్టీ గెలుపు ఖాయమని ప్రజల్లో ఊహాగానాలు వినిపిస్తున్నావి ఎప్పుడు ప్రజలకు అందుబాటులో వుండే వీరు గెలుస్తే ప్రజాసేవలో ముందుంటారని అంటున్నారు ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో ప్రజాధరణ పొందిన బి.సి వర్గానికి చెందిన వారికీ అవకాశం ఇవ్వాలని ప్రజలు కోరుకుంటున్నారు ఇబ్రహీంపట్నం 60%నికి పైగా వున్నా బి.సి ఓట్లను దృష్టిలో పెట్టుకొని పార్టీ అధిష్టానం వీరిని గుర్తించి తగిన న్యాయం చేయాలంటున్నారు తెలంగాణ రాష్ట్ర లో అతిపెద్ద మున్సిపాలిటీ అయిన తుర్కయంజల్ మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షురాలు గా కొనసాగుతున్న శివకుమార్ సతీమణి కూడా ప్రజల్లో మంచి పట్టు, సేవ గునం కలిగిన నాయకురాలు కొత్తకుర్మ మంగమ్మ గతంలో ఈమె తుర్కయంజాల్ గ్రామ సర్పంచ్ గా అలాగే ప్రస్తుతం మున్సిపాలిటీ పార్టీ అధ్యక్షురాలుగా స్థానిక 21వ వార్డు కౌన్సిలర్ గా సేవలoదిస్తున్నారు తుర్కయంజాల్ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ గా అవకాశం వున్నా కొన్ని కారణాలవళ్ళ ఆ పదవి దక్కలేకపోయింది బిసి వర్గానికి చెందిన వారు మంగమ్మ శివకుమార్ కి టికెట్ కేటాయిస్తే ఇబ్రహీంపట్నం లో కాంగ్రెస్ గెలుపు కాయం అని అంటున్నారు