చంద్రబాబు అక్రమ అరెస్టును నిరసిస్తూ ఇబ్రహీంపట్నం టీడీపీ శ్రేణుల నిరసన
టీడీపీ జాతీయ నాయకుడు నారా చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టు ను నిరసిస్తూ టిడిపి ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ఇంచార్జి చింతకింది చక్రపాణి ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించి, వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.జగన్ మోహన్ రెడ్డి ఫొటోను చెప్పులతో కొట్టి నిరసన వ్యక్తం చేశారు ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ జగన్ మోహన్ రెడ్డి కక్ష సాధింపు చర్యలు మానుకోవాలని లేదంటే తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని అన్నారు. జగన్ ని గద్దె దించే రోజు తొందరలోనే ఉందన్నారు.అక్రమ అరెస్టులకు చంద్రబాబు నాయుడు భయపడరని, 40 సంవత్సరాల రాజకీయ జీవితంలో అవినీతి లేని నాయకుడని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత అన్నారు. రానున్న ఎన్నికల్లో జగన్ కి ప్రజలు బుద్ధి చెప్తారని హెచ్చరించారు. విచారణకు పిలవకుండానే నేరుగా అరెస్టు చేయడం కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్య అని అన్నారు.ఈ కార్యక్రమంలో టి డిపి ఇబ్రహీంపట్నం మున్సిపల్ అధ్యక్షుడు జక్కా రాం రెడ్డి,సీనియర్ నాయకులువంగల కృష్ణ,బొమ్మకంటి అశోక్,జక్క కరుణాకర్ రెడ్డి,కాసోజు వీరాచారి,మహేందర్ ముదిరాజ్,లతీఫ్, నక్క మహేందర్ యాదవ్, ఆవుల శ్రీనివాస్ యాదవ్ తదితరులు పాల్గొన్నారు.