ముమ్మారెడ్డి ప్రేమకుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం

-పెద్ద సంఖ్యలో హాజరై వైద్య పరీక్షలు చేయించుకుని బస్తివాసులు

-ఉచితంగా మందులు అందించిన ముమ్మారెడ్డి ప్రేమకుమార్,కాంతారావు

సికింద్రాబాద్ ఆర్ సి జనంసాక్షి సెప్టెంబర్ 10 కూకట్ పల్లి నియోజకవర్గం,ఓల్డ్ బోయిన్ పల్లి119 డివిజన్ పరిధిలో హరిజన బస్తీలో ముమ్మారెడ్డి ప్రేమకుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో పేద ప్రజలు కు ఉచిత వైద్య శిబిరంను ఏర్పాటు చేసిన బిజెపి సీనియర్ నాయకులు ముమ్మారెడ్డి ప్రేమ కుమార్. ఈ ఉచిత వైద్య శిబిరంలో రామ్‌దేవ్ హాస్పిటల్ డాక్టర్లు సౌజన్యం తోడాక్టర్.సత్యనారాయణ,డాక్టర్.సాగరిక
డాక్టర్.యోబు ఇతర సిబ్బంది పర్యవేక్షణలో వైద్య పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు ను అందజేయడమైంది.ఈ సందర్భంగా బిజెపి నాయకుడు ముమ్మారెడ్డి ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ పేద ప్రజలు ఉన్నారని వారు భారీగా ఖర్చు చేసి కార్పొరేట్ హాస్పిటల్లో పరీక్షలు చేయించుకోలేని వారు ఉన్నారని అలాంటి వారి కోసంఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. బస్తీ దవాఖానాలు ఉన్నప్పటికీ పేరుకు మాత్రమే ఉన్నాయని సరియైన వైద్యం అందడం లేదు ఈ సందర్భంగా ఆయన ఆరోపించారు పేద ప్రజల కోసం నిరంతరం ఇలాంటి ఉచిత వైద్య శిబిరాలను మా ముమ్మారెడ్డి ప్రేమకుమార్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యం లో ఇకపై కూడా ఏర్పాటు చేస్తేనే ఉంటామని ఆయన ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్ మల్కాజిగిరి అర్బన్ జిల్లా అధ్యక్షులు పన్నాల హరీష్ రెడ్డి,మాధవరం కాంతారావు,పప్పుపటేల్,డివిజన్ అధ్యక్షులు సంతోష్ గౌడ్,తిరుపతి యాదవ్,రవికుమార్ గౌడ్,జి.జగదీష్, వేణుగోపాల్ రెడ్డి, సంధిశంకర్, మహిళా నాయకురాలు లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు