ఘనంగా చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి నిర్వహించిన రజక సంఘనాయకులు
సికింద్రాబాద్ ఆర్ సి జనంసాక్షి సెప్టెంబర్ 10 సిక్కు విలేజ్ దోభీఘాట్ వద్ద రజక సంఘ ఆధ్వర్యంలో ఆదివారం నాడు ఘనంగా చాకలి ఐలమ్మ 38వ వర్ధంతి కార్యక్రమా నిర్వహించారు. కార్యక్రమానికి మల్కాజ్గిరి పార్లమెంటరీ కంటోన్మెంట్ అసెంబ్లీ, మల్కాజ్గిరి పార్లమెంట్ ఇంచార్జ్ మర్రి రాజశేఖర్ రెడ్డి,కంటోన్మెంట్ బోర్డు సీఈవో మధుకర్, బిజెపి నాయకుడు పరుశురాం,
జంపన ప్రతాప్ ,కార్పొరేటర్ కే.దీపిక, అనిత ప్రభాకర్,పిడమర్తి రవి, టిఎన్ శ్రీనివాస్, సామలసత్తిరెడ్డి తో పాటు పలువురు నాయకులు పాల్గొన్నారు. ఐలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ ఐలమ్మ చేసిన సేవలు రేపటి పౌరులకు కూడా తెలియాలంటే ఇలాంటి కార్యక్రమాలకి చిన్నపిల్లలను బాలులను కూడా తీసుకో రావాలని సూచించారు.ఆవిధంగా చేయటంవల్లరాబోయే తరాల వారికి ఐలమ్మ యొక్క చరిత్ర తెలుస్తుందని అలాగే రజకులు ఐలమ్మ స్ఫూర్తిగా తీసుకోవాలని ముఖ్యంగా రజకులంతా ఒక తాటిపై ఉంటే ఏదైనా సాధించవచ్చు అని చెప్పారు.రాష్ట్ర ప్రభుత్వపరంగా కానీ తన పరంగా కాని ఎలాంటి సహాయం సహకారం ఎల్లవేళలా అందిస్తానని రాజశేఖర్ రెడ్డి హామీ ఇచ్చారు.
ఈ కార్యక్రమంలోరజక సంఘం ఫేస్ 2 అధ్యక్షుడుసత్యనారాయణ,ఇతరప్రతినిధులు ఎల్. కృష్ణ భీమ్రావు,సోమయ్య, బి.శ్రీను,ఎల్ శంకర్,రాజయ్య,ఎల్.ఆర్ ఎల్లయ్య,పి.రాజు తదితరులు పాల్గొన్నారు.