కార్మికులకు వేతన ఒప్పందం, చట్టబద్ధ హక్కులు, సింగరేణి లాభాల్లో వాటా చెల్లించాలి-ఐఎఫ్టియు డిమాండ్
టేకులపల్లి, సెప్టెంబర్ 11 ( జనం సాక్షి): కోల్ ట్రాన్స్పోర్ట్ కార్మికులకు వేతన ఒప్పందం, చట్టబద్ధ హక్కులు, సింగరేణి లాభాల్లో వాటా చెల్లించాలని ఐ ఎఫ్ టి యు డిమాండ్ చేస్తుంది. సోమవారం కోయగూడెం ఓసి లో ఎల్ మారుతీ రావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో సింగరేణి కాలరీస్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎండి రాసుద్దీన్ మాట్లాడుతూ కోయగూడెం నుండి వివిధ ప్రాంతాలకు బొగ్గు రవాణా చేస్తున్న టిప్పర్ డ్రైవర్ల క్లీనర్ల వేతన ఒప్పందం జరగక కొన్ని సంవత్సరాలు అవుతుందని అన్నారు. సింగరేణి లో వచ్చిన లాభాలలో కాంట్రాక్ట్ కార్మికులకు 35% లాభాల వాటా చెల్లించాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా గత సంవత్సరం సెప్టెంబర్ నెలలో కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో రాంబాబు,రాజు, సురేష్, పవన్, రవి,సాయి, రాజేష్,వెంకటేశ్వర్లు, పరమేష్ తదితరులు పాల్గొన్నారు.