రైతే రాజు – దేశానికి వెన్నెముక రైతు

– రైతు లేనిదే రాజ్యం లేదు
భారత్ బచావో రైతు రణభేరి సభలో కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు ననావత్ భూపాల్ నాయక్.

డోర్నకల్/కురవి,సెప్టెంబర్ 10, జనం సాక్షి న్యూస్:దేశానికి రైతే రాజుని, రైతు లేనిది రాజ్యం లేదని, రైతే దేశానికి వెన్నెముక అని అలాంటి రైతులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యం చేస్తున్నాయని కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు ననావత్ భూపాల్ నాయక్ అన్నారు.రైతులు తాము పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక మార్కెట్ యార్డులోనే తగలబెడుతున్నారని భూపాల్ నాయక్ ఆవేదన వ్యక్తం చేశారు.ఆదివారం జిల్లాలోని కురివి మండలంలోని ఓం ఫంక్షన్ హాల్ లో” భారత్ బచావో రైతు రణభేరి” నిర్వహించిన బహిరంగ సభలో భూపాల్ నాయక్ ప్రసంగించారు.డోర్నకల్ నియోజకవర్గంలో ఏ రైతు కష్టపడ్డ తాను ఆదుకుంటానని, అండగా ఉంటానని అన్నారు. రైతు పండించే పంటలకు గిట్టుబాటు ధర కల్పించడంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని భూపాల్ నాయక్ దుయ్యబట్టారు.గత తొమ్మిది సంవత్సరాలలో కెసిఆర్ ప్రభుత్వ హయాంలో వేల మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారని విమర్శించారు.ప్రతి పార్టీ రైతులకు అండగా ఉంటామని ఊక దంచుడు ఉపన్యాసాలు తప్ప, ఏ పార్టీ కూడా రైతులకు మేలు చేయలేదని భూపాల్ నాయక్ ఘాటుగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వ విధానాల వల్ల ప్రతి సంవత్సరం రసాయన ఎరువులు, పురుగుల మందులు, విత్తనాలు ధరలు విపరీతంగా పెరిగి రైతులపై పెను భారం పడుతుందని అన్నారు.రైతు లేనిదే రాజ్యం లేదు. గ్రామీణ రైతులు ఆరుగాల శ్రమించి ఆహారం పండించకపోతే ప్రపంచం ఆకలితో అలుమటిస్తుంది అని భూపాల్ నాయక్ అన్నారు.తాను రాజకీయాలలోకి ఎందుకు వచ్చాను అని చెబుతూ, ప్రజల కొరకు ఏ మంచి పని చేద్దామన్న రాజకీయాలు అడ్డం వస్తున్నాయని,అందుకే రాజకీయాలలోకి వచ్చానని డోర్నకల్ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేయనున్నానని, నియోజకవర్గ ప్రజలు తనను గెలిపిస్తే నియోజకవర్గానికి అత్యధిక సేవ చేయగలరని, డోర్నకల్ రూపురేఖలు మారుస్తానని, నియోజకవర్గాన్ని అభివృద్ధి వైపు పయనింప చేస్తానని భోపాల్ నాయక్ అన్నారు.
ఇంకా ఈ సమావేశంలో ఎం ఎం గోపీనాథ్ వైస్ చైర్మన్, భారత్ బచావో గాది ఇన్నయ్య, ప్రచార కార్యదర్శి, భూపాల్ నాయక్ కిసాన్ పరివార్ వ్యవస్థాపకులు. టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర యూత్ నాయకులు గుగులోత్ రవి నాయక్, సిఐటియు జిల్లా నాయకులు ఆకుల రాజు, మండల వెంకన్న, న్యూ డెమోక్రసీ కార్యదర్శి. నల్లు సుధాకర్ రెడ్డి,సిపిఐ పార్టీ డోర్నకల్ నియోజకవర్గం. డివైగిరి, పిసిసి మాజీ అధికార ప్రతినిధి, భీమా నాయక్, ఎల్ హెచ్ పి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి. విష్ణు నాయక్, ఎల్ హెచ్ పి జిల్లా నాయకులు. తదితరులు కార్యకర్తలు పెద్ద ఎత్తున మహిళలు, డోర్నకల్ నియోజకవర్గం ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ, బిఆర్ఎస్ పార్టీ, వివిధ పార్టీల నాయకులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు