గ్రామాల్లో పారిశుద్ధ్యం అస్తవ్యస్తం
* కొన్ని గ్రామపంచాయతీలలో శానిటేషన్ పనులు జరగడం లేదు
* పనిచేయకుండా ప్రకటనలు చేస్తున్న అధికారులు
* అధికారుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు
* ప్రజాపంధ మండల కమిటీ
టేకులపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి): మండలంలోని చాలా గ్రామపంచాయతీలలో పారిశుద్ధ్యం పేరుకుపోయి చెత్తాచెదారం మురికి నీరు నిలువలతో, పైప్ లైన్ లీకేజీలతో అస్తవ్యస్తంగా ఉండడంతో దోమల స్వైర విహారం చేస్తూ సీజనల్ వ్యాధులతో గ్రామాలలోని జనం విష జ్వరాల బారిన పడుతున్నారని, పారిశుద్ధ్య పనులు నిర్వహించడంలో, శానిటేషన్ పనులు సక్రమంగా నిర్వహించకుండా, ఫోటోలు, ప్రకటనలతో ఉన్నతాధికారుల దృష్టికి తీసుకు వెళ్తున్నారని, స్థానిక అధికారులు నిర్లక్ష్యానికి నిదర్శనంగా మండలంలోని చాలా గ్రామాలు అస్తవ్యస్తంగా ఉన్నాయని సిపిఐ( ఎంఎల్ ) ప్రజాపంథా టేకులపల్లి మండల కమిటీ ఆధ్వర్యంలో టేకులపల్లి లోని పలు గ్రామాలు సోమవారం పర్యటించారు. ఈ సందర్భంగా మండల కార్యదర్శి ధర్మపురి వీర బ్రహ్మచారి, ఐఎఫ్టియు జిల్లా నాయకులు జరుపుల సుందర్ మాట్లాడుతూ సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రజలకు సూచించారు. గ్రామాలలో కొన్ని కొన్ని చోట్ల బ్లీచింగ్ పౌడర్ చల్లటం లేదని, దోమల మందు పిచికారి చేయటం లేదని, ఫాగింగ్ చేయడం లేదని, గ్రామాల్లో అక్కడక్కడ వీధులలో చిన్న చిన్న కుంతలు పూడ్చడం గాని చేయలేదని, కొన్ని గ్రామాలలో పారిశుద్ధ్య పనులు అస్తవ్యస్తంగా ఉన్నదని వారి వివరించారు.పనులు పూర్తి కాకుండానే అన్ని గ్రామ పంచాయతీలలో పారిశుధ్య పనులు పూర్తి అయిందని, ఎంపీడీవో వీరబాబు ప్రకటించటం సరైనది కాదని, టేకులపల్లి పంచాయతీలోని బోడ బజారున దారికి అడ్డంగా పోసిన మట్టిని మూడు రోజులు అయినప్పటికీ సరి చేయలేదని
వారు అన్నారు. మురికి కాలువలను శుభ్రం చేయడం లేదని, పైపు లీకేజీ