వరద ముంపుకు గురికాకుండా చర్యలు
వరంగల్ ఈస్ట్, సెప్టెంబర్ 11 (జనం సాక్షి)వరంగల్ తూర్పు నియోజకవర్గంలోని సాకరాశికుంటను పేరు మారుస్తూ హనుమాన్ నగర్ గా నామకరణ రూపొందించుకుంటున్న సందర్భంగా అభివృద్ధి కమిటీ ఆహ్వానం మేరకు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ఈ నామకరణ కార్యక్రమానికి హాజరై అభివృద్ధి కమిటీకి శుభాకాంక్షలు తెలిపారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ…
సాకరాశికుంట ప్రాంతాన్ని హనుమాన్ నగర్ గా మార్చడం పట్ల ఎమ్మెల్యే నరేందర్ శుభాకాంక్షలు తెలిపారు.హనుమాన్ నగర్ వరద ముంపుకు గురి కాకుండా చర్యలు చేపట్టడం జరిగిందని డ్రైనేజి పనులు త్వరిగతిన పూర్తి చేసి రాబోవు వర్షాకాలం లోపు ఈ ప్రాంతాన్ని గొప్పగా మార్చుతానని ఎమ్మెల్యే వారికి హామీ ఇచ్చారుడివిజన్లలోని అభివృద్ధికి భారీగా నిధులు కేటాయించడం జరిగిందని అభివృద్ధిలో వరంగల్ తూర్పు నియోజకవర్గాన్ని ముందు ఉంచుతున్నామని రాబోవు రోజుల్లో కంపెనీలు ఏర్పాటు చేసి మన బిడ్డలకు ఉపాది దొరికేలా చూస్తామని ఎమ్మెల్యే తెలిపారు.హనుమాన్ నగర్ అభివృద్ధి కమిటీ కమ్యూనిటీ హాల్ కు 10లక్షల రూపాయలు కేటాయిస్తున్నట్టు ఎమ్మెల్యే తెలిపారు.అభివృద్ధికి తాను సహకరిస్తానని రాబోవు ఎన్నికల్లో తనకి అండగా నిలవాలని ఎమ్మెల్యే కోరారు.ఈ కార్యక్రమంలో స్థానిక కార్పొరేటర్లు సిద్ధం రాజు,ముష్కమల్ల అరుణ సుధాకర్,డివిజన్ పెద్దలు హాజరయ్యారు