ఓట్ల కోసమే దళిత, బిసి బందు, గృహలక్ష్మి పథకాలు తెరపైకి..!
– ఏఐసిసి కార్యదర్శి శ్రీధర్ బాబు – దుదిల్ల సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన దళితులు
జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో రామగిరి మండలం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆదివారం పేట ఎస్సీ కాలనీ చెందిన బిఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలు సుమారు 50 మంది ఎఐసిసి కార్యదర్శి, మంథని ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు. వీరికి శ్రీధర్ బాబు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. 10సం రాల్లో అమలు చేయని దళిత, బిసి బందులతో పాటు గృహలక్ష్మి తదితర పథకాలు రెండు నెలల్లో ఎలా చేస్తారు..? అని ప్రశ్నించారు. ఓట్ల కోసమే టిఆర్ఎస్ పార్టీ ఈ పథకాలను తెరపైకి తీసుకు వచ్చిందని శ్రీధర్ బాబు ఆరోపించారు. రానున్నది ఇందిరమ్మ రాజ్యమే నని, అప్పుడు ప్రజలందరికీ పార్టీలతో సంబంధం లేకుండా అందరికీ న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మంథని బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు తొట్ల తిరుపతి యాదవ్, కాంగ్రెస్ సీనియర్ నాయకుడు వనం రాంచందర్రావు, మంథని అసెంబ్లీ యూత్ అధ్యక్షులు బర్ల శ్రీనివాస్, లద్నాపూర్ మాజీ సర్పంచ్ రొడ్డ బాబు, నాగేపెల్లి ఎరుకల బాపురావు, తాళ్లపల్లి నారాయణ, గొర్రె నరేష్, అడ్డూరి ప్రవీణ్, రామయ్య పల్లె ఉప సర్పంచ్ నరేష్ యాదవ్ మంథని మండలం యూత్ అధ్యక్షుడు ఎలుకల ప్రవీణ్, ఉత్తర మండల యూత్ అధ్యక్షుడు బి ఎన్ శివకుమార్ , కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.