బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిక అసత్య ప్రచారం

రాయపర్తి,సెప్టెంబర్11(జనంసాక్షి):
రాయపర్తి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ లకావత్ సమ్మక్క భాస్కర్ బిఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లోకి చేరారు అన్నది అసత్య ప్రచారం అని వాళ్లు గతంలో కాంగ్రెస్ పార్టీలోనే సర్పంచ్ గా గెలిచి కాంగ్రెస్ లోనే ఉన్నారని కొత్తగా పార్టీలో చేరినట్లు చెప్పుకోవడం సిగ్గుచేటు అని,వారికి బిఆర్ఎస్ పార్టీకి ఎటువంటి సంబంధం లేదని బిఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు మునావత్ నర్సింహా నాయక్ అన్నారు.ఈ కార్యక్రమంలో రాయపర్తి జడ్పీటీసీ రంగు కుమార్ గౌడ్,మండల పార్టీ అభివృద్ధి కమిటీ చైర్మన్ బిల్లా సుధీర్ రెడ్డి,మండల రైతు బంధు అధ్యక్షుడు ఆకుల సురేందర్ రావు,కోలన్ పల్లి పీఎసీఎస్ చైర్మన్ జక్కుల వెంకట్ రెడ్డి,మండల పార్టీ ప్రధాన కార్యదర్శి పూస మధు,మార్కెట్ కమిటీ డైరెక్టర్ కుందూరు యాదగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు