ట్రైకార్ లబ్ధిదారులకు న్యాయం చేయాలి
రఘునాథ పాలెం సెప్టెంబర్ 11(జనం సాక్షి)
గిరిజన సంక్షేమ సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గుగులోత్ సురేష్తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గిరిజన ప్రజల ఆర్థిక అభివృద్ధి కోసం ప్రవేశపెట్టిన ట్రైకార్ నిధులను తక్షణమే మంజూరు చేయాలని ఖమ్మం జిల్లా కలెక్టర్ వి.పీ గౌతమ్ ని గిరిజన సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో వినతి పత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా గిరిజన సంక్షేమ సంఘం ఖమ్మం జిల్లా కోఆర్డినేటర్ గూగులోత్ సురేష్ నాయక్ మాట్లాడుతూ గత మూడు సంవత్సరాల నుంచి గిరిజన ట్రైకార్ నిధులను విడుదల చేయకుండా పెండింగ్లో ఉందనీ,బ్యాంకర్లు లబ్ధీదారుఉలను బ్యాంకుల చుట్టూ తిప్పుకుంటూన్నారనీ, ఎంపీడీవో కార్యాలయం చుట్టూ లబ్ధీదారులు మూడు సంవత్సరాలు నుంచి తిరిగిన ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయిందని ఇకనైనా స్పందించి గిరిజనుల ట్రైకార్ నిధులను తక్షణమే మంజూరు చేసి గిరిజనులకు ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో కుసుమంచీ,తిరుమలాయపాలేం మండల సభ్యులు ధారావత్ వెంకన్న నాయక్, భాస్కర్ నాయక్, సురేష్ నాయక్, శ్రీకాంత్ నాయక్,శ్రీను నాయక్, అశోక్,గాంధీ,రఘు నాయక్* తదితరులు పాల్గొన్నారు.