ఆపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం కోసం అండగా సీఎంఆర్ఎఫ్- టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి ,  సెప్టెంబర్ 11అపత్కాలంలో నిరుపేదలకు మెరుగైన వైద్యం అందించడంలో సిఎంఆర్‌ఎఫ్ అండగా నిలుస్తుందని టీఎస్ హెచ్ డి సి  చైర్మన్ చింతా ప్రభాకర్ అన్నారు .సదాశివపేట మం. అంకెనపల్లి గ్రామానికి చెందిన సుశీలకు మెరుగైన వైద్య చికిత్స కోసం హైదరాబాద్‌లోని నిమ్స్ హాస్పిటల్‌కు సిఎంఆర్‌ఎఫ్ ద్వారా రూ.2.50 లక్షల విలువైన ఎల్‌ఓసిని చింతా ప్రభాకర్ అదజేసారు.సదాశివపేట పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంపు కార్యాలయంలో సుశీల కుటుంబ సభ్యులకు ఎల్‌ఓసి అనుమతి పత్రంను అందజేశారు .ఎల్‌ఓసిని మంజూరు చేయించిన చింతా ప్రభాకర్ కు వారు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

తాజావార్తలు