మన సాంప్రదాయాలను  గౌరవించడం మన విధి-టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ 

సంగారెడ్డి బ్యూరో ,  జనం సాక్షి , సెప్టెంబర్ 11  :-మన సాంప్రదాయం మనం గౌరవించడం మన మన విధి అని టి ఎస్ సి డి సి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు. సోమవారం  సంగారెడ్డి జిల్లా కంది మండలం కౌలంపేట్ గ్రామంలో శ్రీ భవాని మాత షష్టమ వార్షికోత్సవంలో భాగంగా కళ్యాణ మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు కార్యక్రమంలో చింతా ప్రభాకర్  పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.  ఈ సందర్భంగాకవలంపెట్ గ్రామ సర్పంచ్ షఫీ చింతా ప్రభాకర్ కు శాలువాతో ఘనంగా సన్మానించారు.తదనంతరం ప్రత్యేక పూజలు నిర్వహించి..వేద ఆశీర్వచనములు ప్రసాదాలను అందజేశారు.కార్యక్రమంలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి ,జెడ్పీటీసీ కొండల్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షులు మధుసూదన్ రెడ్డి ,జైపాల్ రెడ్డి, పట్నం మాణిక్యం  ,సర్పంచ్ షఫీ ,మాజీ జెడ్పీటీసీ మనోహర్ గౌడ్ , పెరమాళ్ల నర్సింలు ,భక్తులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు