అక్టోబర్ 28 న సింగరేణి ఎన్నికలు!
(ప్రత్యేక ప్రతినిధి / జనం సాక్షి) ఐదు సంవత్సరాల తర్వాత సింగరేణి లో యూనియన్ గుర్తింపు ఎన్నికలు జరుగనున్నాయి.అక్టోబర్ 28 న ఎన్నికలు,7 న నామినేషన్ ల స్వీకరణ,9 న రంగం లో ఉండే యూనియన్ ల అర్హత, స్క్రటిని,10 న గుర్తుల కేటాయింపు, ఉంటుంది.హైదరాబాద్ లోని సెంట్రల్ లేబర్ డిప్యూటీ కమీషనర్ కార్యాలయం లో ఈ మేరకు మినిట్స్ డ్రా చేసుకుని సంతకాలు కూడా చేసుకున్నారు!సోమవారం హైదరాబాద్ లోని డిప్యుటీ చీఫ్ లేబర్ కమిషనర్,ఎన్నికల రిటర్నింగ్ ఆఫీసర్ శ్రీనివాసులు సమక్షంలో అతని కార్యాలయం లో సింగరేణి లోని 14 రిజిస్టర్డ్ కార్మిక సంఘాల ప్రతినిధుల,యాజమాన్యం ప్రతినిధుల సమావేశం జరిగింగింది! సింగరేణి డైరెక్టర్ ఫైనాన్స్,పర్సనల్ బలరాం,యూనియన్ నేతలు పాల్గొన్నారు.కొన్ని యూనియన్ లు గెలిచే యూనియన్ కు సంబంధించి కాలపరిమితి రెండు సంవత్సరాలు ఉండాలని ఓ మూడు యూనియన్లు,కొందరు నాలుగు ఏండ్లు మాత్రమే ఉండాలని,మెజారిటీ యూనియన్లు కోరిన నేపథ్యంలో విషయాన్ని ఢిల్లీ లోని సీఎల్సి కి విన్న వించడానికి యాజమాన్యం సమయం అడిగింది! అయితే గతంలోనే సిఎల్సి గుర్తింపు కాలపరిమితి ని రెండేండ్లుగా నిర్ణయించడం జరిగింది!యూనియన్ ఎన్నికల్లో బిఆర్ఎస్ అనుబంధ టిబిజీకెఎస్ తో పాటు,ఏఐటీయూసీ,ఐఎన్టియుసి,హెచ్చెమ్మెస్,సీఐటీయూ,బిఎమ్మెస్ ల తో పాటు ఐఫ్టియూ,ఎఐఎఫ్ టియు,ఉద్యోగుల సంఘం,టిఎన్ టి యుసి తదితర 14 సంఘాల నేతలు పాల్గొన్నారు.ఏడో సారి సింగరేణి లో ఎన్నికలు జరుగనుండగా,మూడు సార్లు ఏఐటీయూసీ,ఒకసారి ఐఎన్ టియుసి,రెండు సార్లు టీబిజీకెఎస్ లు గుర్తింపును సాధించాయి! మొత్తం అరుజిల్లాల్లో వ్యాపించి ఉన్న సింగరేణి ఎన్నికలు,డిసెంబర్ లోపు అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో ప్రాధాన్యత ను సంతరించుకొనున్నాయి, 2024 లో పార్లమెంట్ ఎన్నికలను సైతం సింగరేణి ఎన్నికలు ప్రభావితం చేస్తాయి! మొత్తం 4 పార్లమెంట్,11 అసెంబ్లీ స్థానాల మీద యూనియన్ గుర్తింపు ఎన్నికల గెలుపు, ఓటముల ప్రభావం ఉంటుంది!అందుకే ఈ సారి ఈ ఎన్నికల్లో రాజకీయ పార్టీ ల నేతలు , ఎమ్మెల్యే, ఎంపీ లు ప్రచారం లో కనిపిస్తారు.మంచిర్యాల, కొమురం భీమ్ ఆసిఫాబాద్, పెద్దపల్లి, భూపాలపల్లి, కొత్తగూడెం, ఖమ్మం, ములుగు జిల్లా ల వరకు సింగరేణి ఎన్నికల ప్రభావం ఉంటుంది. ఓటర్లు 44 వేల లోపు మాత్రమే ఉన్నప్పటికీ ప్రభావం చాలా ఉంటుంది. గతంలో ఈ ఎన్నికలను మినీ అసెంబ్లీ ఎన్నికలు అనేవారు. పొటా, పోటీగా ఉండే ఈ ఎన్నికలలో జాతీయ కార్మిక సంఘాల మధ్యనే పోటీ ఉంటుంది అంటే అతిషయోక్తి కాదు.