తెలంగాణ ఉద్యమకారులు బీజేపీ పార్టీ లో చేరండి- బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి పిలుపు
జనంసాక్షి , మంథని : పెద్దపల్లి జిల్లా మంథని పట్టణంలోని బీజేపీ పార్టీ ఆఫీస్ లో తెలంగాణ ఉద్యమకారుడు ముడతనపల్లి ప్రభాకర్, తాటికొండ లింగయ్య, అలాగే బిజెపి మంథని మండల అధ్యక్షులు విరబోయిన రాజేందర్, మండల మహిళ మోర్చా అధ్యక్షురాలు బోసేలి మౌనిక ఆధ్వర్యంలో మల్హర్ రావ్ మండలం తాడిచెర్ల, నాచారం , మంథని మండలం గోపాల్ పూర్ కు చెందిన పలువురు మహిళలు, యువత సుమారు 150 మంది బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు చంద్రుపట్ల సునీల్ రెడ్డి సమక్షంలో సోమవారం బీజేపీ పార్టీ లో చేరారు. వీరికి సునీల్ అన్న కండువాలు వేసి పార్టీలో ఆహ్వానించారు. ప్రధాని నరేంద్ర మోడీ దేశానికి చేస్తున్న సేవలను, పేద పడుగు బలహీన వర్గాలకు అందిస్తున్న సంక్షేమ పథకాలను ఆకర్షితులై పార్టీలో చేరి సునీల్ రెడ్డి తో కలిసి పనిచేయాలని బిజెపి పార్టీలో చేరుతున్నట్టు వారు వెల్లడించారు. అనంతరం సునీల్ రెడ్డి మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకారులకు బిజెపి పార్టీ పెద్దపీట వేస్తుందని , ఉద్యమకారులంతా టిఆర్ఎస్, కాంగ్రెస్ ని వదిలి బిజెపి పార్టీలో చేరాలన్నారు. ఏ ఒక్క ఉద్యమకారుని కుటుంబానికి ఒక పదవిని ఇవ్వలేదని, 1200 మంది విద్యార్థులు, అమరులైతే వారి కుటుంబాలను ఆదుకున్న పాపాన పోలేదన్నారు. తాను అమెరికాలో ఉన్న ఉద్యోగాన్ని వదిలేసుకుని వచ్చి, స్వరాష్ట్రం కొరకు నా జీవితాన్ని త్యాగం చేస్తే టిఆర్ఎస్ పార్టీలో రెండుసార్లు కెసిఆర్ తనను మోసం చేశారని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో అసెంబ్లీ కన్వీనర్ మల్క మోహన్ రావు, రామగిరి మండల ఇంచార్జ్ ఎడ్ల సదాశివ్, మండల ఉప అధ్యక్షులు రేపాక శంకర్, ఎస్ సి మోర్చా మండలం అధ్యక్షులు బూడిద రాజు, సీనియర్ నాయకులు కోరబోయిన మల్లిక్, బోసెల్లి శంకర్, అలవేణి సమ్మయ్య, కురుమ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.