అంగన్వాడి టీచర్లు, హెల్పర్ల నిరవధిక సమ్మె

* సమస్యలు పరిష్కారం కోసం పోరాటాలే శరణ్యం

* సిఐటియు ఏఐటీయూసీ నాయకురాళ్లు శకుంతల, ఇందిర

టేకులపల్లి, సెప్టెంబర్ 11( జనం సాక్షి ): తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు తమ సమస్యల సాధన కోసం సీఐటీయూ, ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిరవధిక సమ్మె సోమవారం నుండి ప్రారంభం కాగా, అందులో భాగంగా టేకులపల్లి మండల కేంద్రంలోని తహసిల్దార్ కార్యాలయం ఎదుట సమ్మె కొనసాగించారు. అందుకు నాయకత్వం వహించిన సిఐటియు జిల్లా నాయకురాలు కే శకుంతల, ఏఐటీయూసీ నాయకురాలు వై ఇందిరా సమ్మెను ఉద్దేశించి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్స్, హెల్పర్స్,మినీ టీచర్స్ సమస్యల పరిష్కారం కోసం జరుగుతున్న సమ్మె అంగన్వాడీ కేంద్రాలు సమ్మె ప్రభావంతో దాదాపు 90% కేంద్రాలు మూతపడ్డాయని అన్నారు. అంగన్వాడి ఉద్యోగులను పర్మినెంట్ చేయాలి, కనీస వేతనం 26 వేలు ఇవ్వాలని, బేసరత్తుగా మినీ టీచర్లను మెయిన్ టీచర్లుగా గుర్తించి హెల్పర్లను నియమించాలని అన్నారు.సుప్రీం కోర్ట్ తీర్పు ప్రకారం గ్రాటివిటీ చెల్లించాలని,రిటైర్మెంట్ బెనిఫిట్ 10 లక్షల రూపాయలు టీచర్లకు ఐదు లక్షల రూపాయలు హెల్పర్లకు చెల్లించాలని, వేతనంలో సగం పెన్షన్ చెల్లించాలని, ప్రమాద భీమా సౌకర్యము 5 లక్షలు చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ న్యాయమైన సమస్యలు పరిష్కరించే వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరవధికంగా సమ్మె కొనసాగుతుందని వారన్నారు. ఈ కార్యక్రమంలో వై పద్మావతి,ఎన్ విజయలక్ష్మి,కె భద్రమ్మ,వి సంధ్యారాణి,బి సునీత,కే రాజేశ్వరి,పి రాజేశ్వరి,ఎం సుజాత,ఎం నాగమణి,రాధా తదితరులు నాయకత్వం వహించగా మండలంలోని అంగన్వాడీ టీచర్లు, మినీ అంగన్వాడి టీచర్లు, హెల్పర్లు పాల్గొన్నారు.

తాజావార్తలు