మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా అయిలి ప్రసాద్


జనంసాక్షి, మంథని : పెద్దపల్లి జిల్లా మంథని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా అయిలి ప్రసాద్, మంథని మండల వర్కింగ్ ప్రెసిడెంట్ గా బూడిద శంకర్ నియమితులయ్యారు. సోమవారం వారు మంథని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో దుద్దిల్ల శ్రీధర్ బాబు ని మర్యాదపూర్వకంగా కలిసి తమ నియామకం పట్ల కృతజ్ఞతలు తెలిపారు. వారికి ఎమ్మెల్యే శ్రీధర్ బాబు పార్టీ కండువా కప్పి అభినందించారు. అనంతరం ఐలి ప్రసాద్, బూడిద శంకర్ కాంగ్రెస్ శ్రేణులతో కలిసి వెళ్లి మంథని చౌరస్తాలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కి , మాజీ స్పీకర్ శ్రీపాద రావు కి విగ్రహాలకు పూలమాల వేసి నివాలులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ.. ప్రభుత్వం అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విదనాలను ప్రజల్లోకి తీసుకెళ్తామని, కాంగ్రెస్ బలోపేతానికి కృషి చేస్తామని పేర్కొన్నారు. తమపై నమ్మకం ఉంచి పార్టీ పగ్గాలు అప్పగించిన ఎమ్మెల్యే దుద్దిల్ల శ్రీధర్ బాబు కి , శ్రీను బాబు కి వారు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

తాజావార్తలు