గొర్రెల పంపిణీలో ఎమ్మెల్యేల ప్రమేయం ఎందుకు?
— గొర్రెల పంపిణీలో నగదు బదిలీని చేపడుతూ 3000 రూపాయల పెన్షన్ ఇవ్వాలి
— జిఎంపిఎస్ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా, వినతిపత్రం అందజేత
జనగామ ప్రతినిధి(జనంసాక్షి)సెప్టెంబర్11:తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం2వ విడత గొర్రెల పంపిణీ ప్రారంభిస్తారని ఆశతో అప్పు తెచ్చి లబ్దిదారులు గొర్రెల కోసం డి.డి.లు కట్టి 12 నెలలుగా ఎదురుచూస్తున్నా గొర్రెల పంపిణీ లో ప్రభుత్వ నిర్లక్ష్యం ను నిరసిస్తూ సోమవారం జిఎంపిఎస్ జిల్లా కార్యదర్శి సాధం రమేష్,జిల్లా అధ్యక్షులు మోటె దేవేందర్ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ఎదుట భారీ ధర్నా నిర్వహించారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం గొల్ల కురుమలకు ఇచ్చిన హామీని నేరవేర్చాలని గొర్రెల, మేకల సంఘం పెంపకందారులకు నగదు బదిలీ ఇవ్వాలని సంఘం ఆధ్వర్యంలో పొరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకుండా బి.ఆర్.ఎస్. మండలాధ్యక్షులు,జడ్.పి.టి.సిలు, యం.ఎల్.ఎలు గొర్రెల పంపిణీలో భాగస్వామ్యులు అవుతూ గ్రామాలలోబి.ఆర్.ఎస్. పార్టీలో ఉన్న కార్యకర్తలను మాత్రమే ఎంపిక చేసి, వారి నుండి డబ్బులు వసూలు చేయడం గొల్ల కురుమలను ఇబ్బందులకు గురి చేయడం సరైనది కాదని,వెంటనే ప్రజా ప్రతినిధులు ఎంపిక చేయడం అనేది ఉపసంహరించుకొని పార్టీలకు అతీతంగా గొర్రెల పంపిణీ వేగవంతం చెయ్యాలన్నారు.రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడినప్పటి నుండి గొర్రెల పెంపకందారుల సొసైటి ఎన్నికలు నిర్వహించకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని దాని ద్వారా సోసైటి కను మరుగు అయ్యే అవకాశాలు ఉన్నాయని,తక్షణమే సొసైటి ఎన్నికలు నిర్వహించాలని,వర్షా కాలం ప్రారంభమై 3 నెలలు దాటుతున్నా నాణ్యమైన మందులు అందించడంలో ప్రభుత్వం విఫలం అయిందని, తక్షణమే మూగ జీవాలకు సరిపడ నాణ్యమైన మందులు అందించాలన్నారు.జనగామ పట్టణములో సుమారుగా 1000 మంది గొల్ల కురుమల కుటుంబాలు ఉన్నాయని,ప్రక్కనే ఉన్న యాదాద్రి భువనగిరి జిల్లాలో ఉన్న గొల్ల కురుమలకు,హన్మకొండ జిల్లా కేంద్రములోని చుట్టుప్రక్కల గ్రామాలలో గొల్ల కురుమలకు గొర్రెల పంపిణీ చేపట్టారని, కానీ జనగామ పట్టణములోని గొల్ల కురుమలకు గొర్రెల పంపిణి చేపట్టకపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యంకు నిదర్శనం అని,వెటర్నరీ షాప్స్ లో నఖిలీ మందులు విక్రయిస్తున్నా తనిఖీలు చేయడం లేదని అన్నారు. ప్రమాదవశాత్తు చనిపోయిన గొర్రెల కాపరులకు 10 లక్షల ఎక్స్ గ్రేషియా,ఈ-ల్యాబ్లో ఆధార్ నెంబర్లు తప్పుగా పేర్లు నమోదు అయిన వాటిని వెంటనే సరిదిద్దాలని, 50 సం॥రాలు నిండిన గొల్ల కురుమలకి నెలకు రూ.5 వేల ఫించన్ఇవ్వాలని, సొసైటి ఎన్నికలు తక్షణమే నిర్వహించాలి,గొర్రెలకు నాణ్యమైన మందులు అందించాలి,గొర్రెల పంపిణీకి బదులు నగదు బదిలీ చెయ్యాలి.ఖాళీగా ఉన్న వెటర్నటి డాక్టర్ పోస్టులు భర్తీ చెయ్యాలి.మొబైల్ అంబులెన్స్ ద్వారా పశువులకు,గొర్రెలకు నాణ్యమైన వైద్యం ఉండే విధంగా చర్యలు చేపట్టాలి.జనగామ పట్టణ కేంద్రములో ఉన్న గొల్ల కురుమలకు కూడా గొర్రెల పంపిణీ చేపట్టాలి.చనిపోయిన గొర్రెలకు ఇన్సూరెన్స్ చెల్లించాలని డిమాండ్స్ తో కూడిన వినతిపత్రం ను అదనపు కలెక్టర్ కి అందజేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు జిగారి యాదగిరి,గుండా వెంకటయ్య, కన్నెబోయిన బాలరాజు,భూమల్ల కుమారస్వామి,ఆవుల ప్రభాకర్,గద్ద రాజు,గాజుల రాములు,కర్రె నాగరాజు,వెల్దండ తిరుపతి,మాల్ల యాకయ్య, బాలమైన శ్రీను,గోరిగె యాదగిరి, ఉలిగిళ్ళ చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.