సమ్మెలో పాల్గొంటున్న అంగన్వాడి ఉద్యోగుల పై రాష్ట్ర ప్రభుత్వ వేధింపులు ఆపాలి

జనంసాక్షి, మంథని : తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న అంగన్వాడి ఉద్యోగుల సమ్మె మంథని ఐ సి డి ఎస్ ప్రాజెక్టు కేంద్రంలో ఎమ్మార్వో ఆఫీస్ ముందు ప్రారంభమైంది. ఈ కార్యక్రమంలో తెలంగాణ అంగన్వాడి టీచర్స్ అండ్ హెల్పర్స్ జేఏసీ నాయకులు ఈ జ్యోతి సి ఐ టి యు రాజారత్నం ఏఐటీయూసీ అంగన్వాడి యూనియన్ జిల్లా అధ్యక్షురాలు బి వనజ రాణి మరియు బి గణేష్ పెన్షనర్స్ అసోసియేషన్ నాయకులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. చట్ట ప్రకారం సమ్మె చేస్తున్న అంగన్వాడీ ఉద్యోగుల సమ్మెను విచ్చిన్నం చేయడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఉసిగొల్పి సెంట్ అంగన్వాడీ కేంద్రాల తాళాలను పగలగొట్టడం నిరంకుశ చర్య గా పేర్కొన్నారు. అంగన్వాడి ఉద్యోగులు వెట్టిచేయాలి గాని హక్కులు అడగొద్దు అని ప్రశ్నించారు. అంగన్వాడి ఉద్యోగులకు కనీస వేతనం 26 వేల రూపాయలు చెల్లించాలని సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యూటీ పెన్షన్ సౌకర్యం కల్పించాలని ఆన్లైన్ పని భారం తగ్గించాలని పెండింగ్లో ఉన్న టి ఏ డి ఏ లు చెల్లించాలని ఐసిడిఎస్ కు బడ్జెట్ పెంచాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అంగన్వాడి ఉద్యోగులను ఉద్యోగులపై వేధింపులు ఆపి అంగన్వాడి ఉద్యోగుల సమస్యల పరిష్కారం పై ప్రభుత్వం దృష్టి పెట్టాలని నాయకులు అన్నారు. ఈ కార్యక్రమంలో కే శోభ స్వరూప కృష్ణకుమారి సుగుణ సులోచన రజిత హరిత అంగన్వాడి టీచర్లు ఆయాలు పాల్గొన్నారు.

తాజావార్తలు