తెలంగాణ కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ప్రారంభించిన టి.ఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్.

సంగారెడ్డి పట్టణంలోని గీత నగర్ కాలనీలో పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని చింతా ప్రభాకర్ ప్రారంభించారు . ఈ సందర్భంగా టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ కు పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు ఘన స్వాగతం పలికారు.తదనంతరం చింతా ప్రభాకర్ ను ఘనంగా శాలువాతో సన్మానించి, మేమెంటో అందజేశారు .కమ్యూనిటీ పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా కార్యాలయానికి స్థలం కేటాయించాలని పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కోరారు .దీనికి చింత ప్రభాకర్ సానుకూలంగా స్పందించి సమస్యను పరిష్కరిస్తానన్నారు .కార్యక్రమంలో మాజీ సి డి సి చైర్మన్ విజయేందర్ రెడ్డి, సిహెచ్ ప్రభు గౌడ్,  హుస్సేన్ , హరిఫదిన్ , బాలకృష్ణ ,ఖాజా ఖాన్ , అనిల్ వెంకట్రాంరెడ్డి , ప్రభుదాస్ ,హనుమంత్ , సుభాష్ నాయక్ , పాండు , కృష్ణారెడ్డి , కన్నయ్య జిల్లాలోని వివిధ మండలాలు పట్టణాలకు చెందిన పారామెడిక్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు

 

తాజావార్తలు