ఐజేయు అధ్యక్ష కార్యదర్శులకు సన్మానం-సన్మానించిన డాక్టర్ అనిల్ గుప్తా

మహబూబాబాద్బ్యూరోసెప్టెంబర్11(జనసాక్షి)టియుడబ్ల్యూజె(ఐజేయు) జర్నలిస్ట్ యూనియన్ మహబూబాబాద్ జిల్లా నూతన కమిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన అధ్యక్షులు చిత్తనూరి శ్రీనివాస్, గాడిపల్లి శ్రీహరి లను మహబూబాబాద్ జిల్లా కేంద్రంలోని అనీల్ గుప్తా దంతవైద్య నిపుణులు వారి హాస్పిటల్లో ఇరువురిని శాలువలు కప్పి సన్మానించారు. సమాజ శ్రేయస్సుకు జర్నలిస్టుల పాత్ర చాలా కీలకమైనదని వారికి సమస్యలు వాటిల్లకుండా యూనియన్ భద్రతను కల్పిస్తుందని, ఆ బాధ్యతను మహబూబాబాద్ జిల్లా నుండి జర్నలిస్టులకు అందిస్తున్న శ్రీనివాస్, శ్రీహరి ల సేవలను అనిల్ గుప్తా కొనియాడారు. ఈ కార్యక్రమంలో ఆస్పత్రి సిబ్బంది, పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు

తాజావార్తలు