దేవరకోట ఆలయ అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన మంత్రి అల్లోల

నిర్మల్ బ్యూరో, సెప్టెంబర్12,జనంసాక్షి,,, నిర్మల్ జిల్లా కేంద్రంలోని దేవరకోట శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయం లో రూ.50 లక్షల తో నిర్మించనున్న సాలహారం,గ్రానైట్ నిర్మాణ పనులకు దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి శంకుస్థాపన చేశారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ దేవరకోట దేవాలయం చాలా పురాతనమైన ఆలయం అని కల్యాణ మండపం కు 20 లక్షలు, 50 లక్షలు షెడ్డు, కాలక్షేప మండపం, దుకాణలకు,ఇప్పటి వరకు ఆలయానికి 1 కోటి 20 లక్షల నిధులు మంజూరు చేసినట్లు తెలిపారు. నిర్మల్ పట్టణంలోనే 162 ఆలయాలను 32 కోట్ల 13 లక్షల తో పూర్తిగా దేవాదాయ శాఖ నిధులతో నిర్మించినట్లు తెలిపారు. 80% వరకు ఆలయాల నిర్మాణాలు పూర్తి అయ్యాయని తెలిపారు. అడెల్లి ఆలయాన్ని 15 కోట్లతో కృష్ణ శిలలతో నిర్మిస్తున్నామని ఈ విజయదశమి కి ఆలయ ప్రారంభంకానుందని తెలిపారు.అంతకుముందు లక్ష్మీ వెంకటేశ్వర స్వామి వారిని మంత్రి దర్శించుకుని పూజలు చేశారు.

తాజావార్తలు