యూరియా కోసం రైతులు ఆందోళన చెందవలసిన అవసరం లేదు :పిఎసిఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాస్ రెడ్డి

తిరుమలగిరి (సాగర్ )సెప్టెంబరు 12 (జనంసాక్షి ):యూరియా కోసం రైతులు ఆందోళన చెంది ఇతర ప్రాంతాలకు వెళ్ళవలసిన అవసరం లేదని కొత్తపెళ్లి పిఎసిఎస్ వైస్ చైర్మన్ గజ్జల శ్రీనివాసరెడ్డి అన్నాడు. మంగళవారం ఆయన మండల కేంద్రంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ 40 టన్నుల యూరియా తిరుమలగిరి మండల కేంద్రంలో అందుబాటులో ఉన్నదని, ఒక బస్తా 268 రూపాయలు చొప్పున విక్రయిస్తున్నారని ఆయన తెలిపారు. కావున రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని యూరియా కొరత లేదని ఆయన తెలిపారు.

తాజావార్తలు