క్యాంపు కార్యాలయంలో ఉచిత అల్పాహారం.
బెల్లంపల్లి, సెప్టెంబర్ 12, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మంగళవారం ఉచిత అల్పాహారం కార్యక్రమాన్ని ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య ప్రారంభించారు. నియోజకవర్గంలోని వివిధ గ్రామాల నుంచి వివిధ పనుల నిమిత్తం ఎమ్మెల్యేను కలవడానికి క్యాంపు కార్యాలయానికి వచ్చిన వారికి వారి సమస్యల పరిష్కారంతో పాటు ఆకలి తీర్చడానికి అల్పాహారం ఉపయోగ పడుతుందని ఎమ్మెల్యే అన్నారు. ఈకార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.