మార్కెట్ కాంప్లెక్స్ పనులను పరిశీలించిన ఎమ్మెల్యే.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 12, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలోని కాంటా ఏరియాలో నూతనంగా నిర్మిస్తున్న సమీకృత కూరగాయల మార్కెట్ పనులను మంగళవారం బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య పరిశీలించారు. మార్కెట్ నిర్మాణ పనులు త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ నేతృత్వంలో తెలంగాణ రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి పథంలో దూసుకు పోతుందని, మరోసారి కెసిఆర్ ను ముఖ్యమంత్రిని చేసి ఋణం తీర్చుకోవాలని అన్నారు. ఈకార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ జక్కుల శ్వేతా, కౌన్సిలర్లు సురేష్, అఫ్సర్, కో అప్షన్ సభ్యులు సాజిద్, వాజీద్, నాయకులు విజయ్, కిరణ్, శ్యామ్, ఏజాజ్, శ్రీధర్, వాసు, మురళి, గోలి శివ, ఇతర ప్రజాప్రతినిధులు, సంబంధిత అధికారులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

తాజావార్తలు