లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నేత్రవైద్య శిబిరం.

బెల్లంపల్లి, సెప్టెంబర్ 12, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణంలో మంగళవారం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని వైస్ చైర్మన్ బత్తుల సుదర్శన్ ప్రారంభించారు. లయన్స్ క్లబ్ అఫ్ కరీంనగర్ కంటివెలుగు, శరత్ మాక్సీ విజన్ సూపర్ స్పెషాలిటీ, శాంభవి ఐ విజన్ సెంటర్ సహకారంతో ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం అభినందనీయమని వైస్ చైర్మన్ అన్నారు. పేద ప్రజలకు కోసం ఇలాంటి సేవా కార్యక్రమాలు చేయడం హర్షనీయమన్నారు. ఇలాంటి కార్యక్రమాలను అందరు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈకార్యక్రమంలో కంటి వైద్య నిపుణులు అమోగు, అంజయ్య, లయన్ చక్రపాణి, బీఆర్ఎస్ నాయకులు కలాలి నర్సయ్య, రాజేందర్, అలీ, చరణ్, సతీష్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు