ఈనెల 14న ఉచితంగా మట్టి వినాయకుల పంపిణీ.


శ్రీ బావిగిభద్రేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ సుధాకర్.
తాండూరు సెప్టెంబర్ 12( జనం సాక్షి) పర్యావరణ పరిరక్షణలో బాగా ఈ నెల 14న ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం చేపట్టడం జరుగుతుందని శ్రీ బావిగి భద్రేశ్వర ఆలయ కమిటీ చైర్మన్ బంటారం సుధాకర్ తెలిపారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫ్రెండ్స్ ఫౌండేషన్ ద్వారా గత సంవత్సరమ్ మాదిరి గానే ఈ సంవత్సరం కూడా మట్టి వినాయకులను పంపిణీ చేయడం జరుగుతుందని తెలిపారు.14వతేది గురువారం సాయంత్రం నాలుగు గంటలకు గంజ్ మార్కెట్
ఆవరణలో ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి చేతుల మీదుగా మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలు భక్తులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన విజ్ఞప్తి చేశారు.

తాజావార్తలు