తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం 

-అన్ని వయస్సులతో గల మహిళలకు 8 రకాల సర్వీస్ ప్యాకేజీలు అందుబాటు

-టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్

సంగారెడ్డి బ్యూరో , జనం సాక్షి  , సెప్టెంబర్ 12   :::తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, అన్ని వయస్సులతో గల మహిళలకు 8 రకాల సర్వీస్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయని టీఎస్ హెచ్ డి సి చైర్మన్ చింత ప్రభాకర్ అన్నారు.రెండో విడత లో భాగంగా కంది పి.హెచ్.సి లో ఆరోగ్య మహిళ కార్యక్రమాన్ని మంగళవారం  టీఎస్.హెచ్.డి.సి చైర్మన్ చింతా ప్రభాకర్ ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు.చింతా ప్రభాకర్ కు పి.హెచ్.సి సిబ్బంది పూల వర్షంతో ఘన స్వాగతం ఘన స్వాగతం పలికారు. అనంతరం చింత ప్రభాకర్ ఆసుపత్రిలో పర్యటించి ఓపిపురాలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా చింత ప్రభాకర్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో విప్లవాత్మక కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని, ఇందులో భాగంగాఅన్ని వయస్సులతో గల మహిళలకు 8 రకాల సర్వీస్ ప్యాకేజీలు అందుబాటులో ఉంటాయన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళలకు పెద్దన్న లాగా ఉంటూ వారికి కావాల్సిన అనేక సంక్షేమ పథకాలు అమలు చేయడం జరిగిందన్నారు .మహిళలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరి రెడ్డి, ఎంపీపీ సరళ పుల్లారెడ్డి, జెడ్పీటీసీ కొండల్ రెడ్డి , ఎమ్మార్వో విజయలక్ష్మి, అత్మకమిటి చైర్మన్ కృష్ణ రెడ్డి ,మోహన్ రెడ్డి ,మోహన్ రెడ్డి, సర్పంచ్ విమల వీరేశం ,ఎంపీటీసీలు వర కుమార్ ,శ్రీనివాస్ ,నంద కిషోర్, ఆనంద్, పి.హెచ్.సి సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు