హరీష్ రావు ను మంత్రి పదవి నుండి భర్తరఫ్ చేయాలి

త్వరలో గవర్నర్ ను కలుస్తాం
ఆయన సిద్దిపేట, గజ్వేల్ లో మాత్రమే ప్రచారం చేయాలి జనం సాక్షి ప్రతినిధి మెదక్
మెదక్ ప్రజలపై అంత అక్కసు ఎందుకు?
14 న బంద్ ను వియజవంతం చేయాలి?
— మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్ మొల్సాబ్ —

మెదక్ : సిద్దిపేట, గజ్వేల్ ను మాత్రమే అభివృద్ది చేస్తామని మంత్రి హోదాలో నర్మగర్భ వ్యాఖ్యలు చేసిన హరీష్ రావును ఆ పదవి నుండి తక్షణమే భర్తరఫ్ చేయాలని మెదక్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు మహ్మద్ హఫీజ్ మొల్సాబ్ వ్యాఖ్యానించారు. మంగళవారంనాడు ఆయన మెదక్ లో కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి విలేఖర్లతో మాట్లాడారు. తెలంగాణ ఉద్యమంలో సిద్దిపేట, గజ్వేల్ వారు మాత్రమే పని చేశారని, అందుకే ఆ ప్రాంతాలను మాత్రమే అభివృద్ది చేస్తామని మంత్రి ప్రకటించడం ఆయన అవివేకానికి నిదర్శనమన్నారు. తెలంగాణ ఉద్యమాన్ని రెండు నియోజకవర్గాలకు మాత్రమే ఆపాదించి చులకన చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ ఉద్యమ ద్రోహులు తప్ప ఇలాంటి వ్యాఖ్యలు మరెవరూ చేయరని పేర్కొన్నారు. మంత్రి హరీష్ రావును భర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ త్వరలో రాష్ట్ర గవర్నర్ ను కలుస్తామన్నారు. మంత్రి హోదాలో ఆయన ప్రకటించడం రాజ్యాంగ ద్రోహంగా పరిగణించాలన్నారు. ప్రాంతాల మధ్య తగాదా పెట్ట హరీష్ రావు కు మంత్రిగా కొనసాగే అర్హత లేదన్నారు. మెదక్ ప్రజలంటే మంత్రి హరీష్ రావుకు ముందు నుండి చిన్నచూపు ఉందని, అందుకే అడగడుగునా మెదక్ అభివృద్దిని హరీష్ రావు అడ్డుకుంటున్నారని ఆరోపించారు. మంత్రి హరీష్ రావు అధికార పోకడలకు, మెదక్ ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోరాటమే ఈ నెల 14 న జరిగే మెదక్ పట్టణ బంద్ అని ఆయన అభివర్ణించారు. ఈ బంద్ ను అన్నీ వర్గాల ప్రజల జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మెదక్ పట్టణ బంద్ కరపత్రం విడుదల
మెదక్ ఆత్మగౌరవానికి, హరీష్ రావు దొర పోకడలకు మధ్య సమరమే బంద్ : పీసీసీ నేతలు సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ

మెదక్ :
మెడికల్ కళాశాల మంజూరులో మంత్రి హరీష్ రావు అబద్దపు హామీలకు నిరసనగా ఈ నెల 14 న నిర్వహించే మెదక్ పట్టణ బంద్ కరపత్రాన్ని కాంగ్రెస్ నేతలు మంగళవారం ఆవిష్కరించారు. పీసీసీ సభ్యులు చౌదరి సుప్రబాతరావు, మ్యాడం బాలక్రిష్ణ కాంగ్రెస్ కార్యకర్తలతో కలిసి మెదక్ పట్టణ బంద్ ఆవశ్యకతను వివరిస్తూ కరపత్రం విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి హరీష్ రావు పచ్చి అబద్దాలు చెబుతూ గడిచిన పదేళ్లుగా మెదక్ జిల్లా అభివృద్దిని నాశనం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మెదక్ నీళ్లు, నిధులు, కార్యాలయాలను సిద్దిపేటకు తరలించుకుపోయిన దొంగ మంత్రి హరీష్ రావు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్దిపేట దొరల అహంకారానికి, మెదక్ ప్రజల ఆత్మగౌరవానికి జరిగే సమరమే ఈ నెల 14 న నిర్వహించే మెదక్ పట్టణ బంద్ అని వారు అభివర్ణించారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు రమేష్ రెడ్డి, హఫీజ్ మొల్సబ్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు నాగిరెడ్డి, జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ సల్మాన్, మెదక్ అసెంబ్లీ యూత్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ సంతాప్ప, వికలాంగుల జిల్లా అధ్యక్షులు విజయ్ కుమార్, కొండా సంజీవ్, పట్టణ సోషల్ మీడియా కోఆర్డినేటర్ నవీన్ చౌదరి, శ్రీశైలం, జాకీర్, మాడూర్ నవీన్, బాలరాజ్ గౌడ్, కోటిరాజు, మధుసూదన్, రాజు, మధుతారక్, శాలిపేట రాజు అనిల్, రాజు, మహిపాల్, నవీన్, శ్రీకాంత్ నవీన్, బిక్షపతి, అర్జున్, ప్రభాకర్, గణేష్, అఫ్రోజ్, నవీన్, అమీర్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు