తెలంగాణ కు మూడు గోల్డ్ మెడిల్స్
బెంగళూరులో సెప్టెంబర్ 9వ తేదీ నుండి 12వ తేదీ వరకు జరిగిన అండర్ 19 నేషనల్ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్ పోటీలలో తెలంగాణ రాష్ట్ర జట్టు క్రీడాకారులు 3 గోల్డ్ మెడల్స్ సాధించారని జట్టు మేనేజర్ ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పుల్లూరి సుధాకర్ తెలిపారు, బాలుర సింగిల్స్ లో రుషీంద్ర , బాలికల సింగిల్స్ లో రక్షిత శ్రీ, మిక్స్ డబుల్ లో సాత్విక్ రెడ్డి, వైష్ణవి గోల్డ్ మెడల్స్ సాధించారు, ఈ జట్టుకు కోచ్ అనిల్ కుమార్ వ్యవహరించారు, వీరిని బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి పుల్లెల గోపీచంద్, బ్యాడ్మింటన్ సంఘం బాధ్యులు, ఉమ్మడి అదిలాబాద్ జిల్లా బ్యాడ్మింటన్ సంఘం అధ్యక్షుడు పెద్దపల్లి ఎసిపి ఎడ్ల మహేష్, చీఫ్ అడ్వైజర్ మంచిర్యాల మున్సిపల్ వైస్ చైర్మన్ గాజుల ముఖేష్ గౌడ్, జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ బాధ్యులందరూ మెడల్స్ సాధించిన క్రీడాకారులను, టీం మేనేజర్, కోచ్ ను అభినందించారు