రామగుండం టిక్కెట్ కోసం ఖర్గే కు జనక్ వినతి!
ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున్ ఖర్గే ని ఢిల్లీ లో కలిసి కార్మిక క్షేత్రం అయిన రామగుండం నియోజక వర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరపున తన అభ్యర్థిత్వాన్ని పరిశీలించాలని కొరిన ఐ ఎన్ టి యుసి జాతీయ కార్యదర్శి మరియు రామగుండం నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు జనక్ ప్రసాద్.
కోల్ బెల్ట్ వ్యాప్తంగా 12 అసెంబ్లీ 4 పార్లమెంట్ నియోజకవర్గాలలో యూనియన్ ప్రభావితం చేస్తుందని 2018 ఎన్నికల్లో 12 స్థానాలకు 8 కోల్ బెల్ట్ ఏరియా లో ఐ ఎన్ టి యుసి ప్రభావం వల్ల కాంగ్రెస్ పార్టీ గెలిచిందని గుర్తు చేశారు అదే విధంగా యూనియన్ కాంగ్రెస్ కు ఉన్న సంబంధాలు ఐ ఎన్ టి యుసి ప్లీనరీ లో యూనియన్ కు సీట్ల కేటాయింపు పై రాహుల్ గాంధీ గారు చేసిన వాక్యాలను గుర్తు చేశారు. అదే విధంగా ఐ ఎన్ టి యుసి ప్రాముఖ్యత తెలంగాణ లో సింగరేణి కార్మికుల ప్రభావం గురించి చర్చించి పలు విషయాలను వివరంగా తెలియచేసిన ఐఎన్ టి యుసి జాతీయ కార్యదర్శి జనక్ ప్రసాద్ . దీనికి వారు సానుకూలంగా స్పందించినట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో వారితో పాటు ఐఎన్ టి యుసి జాతీయ కార్యదర్శి ఆర్ డి.చంద్ర శేఖర్ పాల్గొన్నారు.