షేర్ మార్కెట్ పేరుతో 2.11 కోట్లు మోసం

-5 నెలలు గా తప్పించుకు తిరుగుతున్న మోసగాన్ని పట్టుకొన్న సీపీ టాస్క్ ఫోర్స్ టీమ్.

రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఈరోజు రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను షేర్ మార్కెట్ పేరుతో మోసం చేసి 5 నెలలు గా తప్పించుకు తిరుగుతున్న నిందితుని అరెస్ట్ వివరాలు వెల్లడించారు.రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో అమాయక ప్రజలను మోసం చేస్తూ మోసలకు పాల్పడుతున్నాడనే పిర్యాదు మేరకు రామగుండం పోలీస్ కమిషనర్ రెమా రాజేశ్వరి ఐపిఎస్., ఆదేశాల మేరకు టాస్క్ ఫోర్స్ ఏసీపీ మల్లారెడ్డి, టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్ గారి ఆధ్వర్యంలో ప్రత్యేక టీమ్లు ఏర్పాటు చేసి నిందితుని పట్టుకోవడం కోసం ప్రయత్నం చేయడం లో భాగంగా మంగళవారం నిందితుడు మరికొంత మంది వద్ద నుండి డబ్బులు వసూలు చేయడం కోసం హైదరాబాద్ నుండి మంచిర్యాల కు వస్తున్నాడానే నమ్మదగిన సమాచారం మేరకు మంచిర్యాల లోని రైల్వే బ్రిడ్జ్ ప్రాంతం లో టాస్క్ ఫోర్స్ మరియు మంచిర్యాల పట్టణ పోలీస్ వారు సంయుక్తంగా కలిసి నిందితున్ని పట్టుకోవడం జరిగింది.నిందితుని వివరాలు…….చెవ్వా రవి యాదవ్ ,వృత్తి : డీటీపీ వర్క్, గోసేవా మండల్ రోడ్ , మంచిర్యాల,….స్వాధీనం చేసుకొన్న వాటి వివరాలు….క్రెడిట్ కార్డ్స బ్యాంక్ పాస్ బుక్స్, చెక్ బుక్స్8,100 నగదు రిజిస్టర్ బుక్వివరాలు ఇలా ఉన్నాయి…..నిందితుడు చెవ్వా రవి రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధి మంచిర్యాల, పెద్దపల్లి జిల్లాలలో అమాయక ప్రజలను షేర్ మార్కెట్ లో డబ్బులు పెట్టుబడి పెడితే తక్కువ సమయం లో ఎక్కువ డబ్బులు సంపాదించ వచ్చు మీరు నాకు డబ్బులు ఇస్తే మీకు ఎక్కువ లాభాలు రోజువారీగా, వారం రోజుల వారీగా, నెల వారీగా అధిక మొత్తం లో లాభంతో డబ్బులు ఇస్తాను అని మాయమాటలు చెప్పి వారిని నమ్మించి 50 మంది వద్ద నుండి సుమారు 2.11 కోట్ల డబ్బులు వసూల్ చేయడం జరిగింది. ఇట్టి డబ్బులలో కొంత షేర్ మార్కెట్ లో పెట్టగా నష్టం రావడం జరిగింది. కొంత డబ్బు తన స్వంతగా వాడు కోవడం జరిగింది అని తెలిపారు.ఈ సమావేశం లో టాస్క్ ఫోర్స్ ఏసిపి మల్లారెడ్డి టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ సుధాకర్, అశోక్, టాస్క్ ఫోర్స్ ఎస్సై ప్రసాద్, లచ్చన్న సిబ్బంది పాల్గొన్నారు.

తాజావార్తలు