అవినీతి అధికారులపై కేసు నమోదు
-నింధితులు గా గతంలో విధులు నిర్వహించిన ఎమ్మార్వో, విఆర్వో,సబ్ రిజిస్ట్రార్
అచ్చంపేట ఆర్సీ, 13 సెప్టెంబర్ ,జనం సాక్షి న్యూస్ : విలువైన భూమిని దొడ్డి దారిన తప్పుడు పత్రాలు సృష్టించిన అధికారులు,మరికొందరి పై బల్మూర్ పోలిస్ స్టేషన్లో ఈ నెల 9 వ తేదీ నాడు క్రిమినల్ కేసు నమోదయిన ఘటన వెలుగు చూసింది. వివరాల్లోకి వెళితే ప్రముఖ హైకోర్ట్ న్యాయవాది గాలిమూడి ప్రశాంత్ కుమార్ కేసుకు సంబంధించిన వివరాలను తెలిపిన ప్రకారం..పొలిశెట్టి పల్లి గ్రామానికి చెందిన బండపల్లీ కాశీమ్ కు వారసత్వం గా వచ్చిన 33 గుంటల వ్యవసాయ భూమిని అతని ప్రమేయం లేకుండానే ఎఫ్ ఐ ఆర్ లో నిందితులుగా పేర్కొనబడిన రామకృష్ణ ,జితేందర్ రియల్టర్లు అదే సర్వే నెంబర్ లో నకిలీ పత్రాలను సృష్టించి వాటిని నిజమైనవిగా చేయడానికి అవినీతి అధికారులు అయిన గతంలో బల్మూర్ లో విధులు నిర్వహించిన టి దామోదర్ రెడి ఎమ్మార్వో , బలరాం విఆర్వో , మరియు సీతారాం అచ్చంపేట సబ్ రిజిస్ట్రార్ ల సహకారంతో బాధితుని భూమి ఆక్రమించి అమ్ముకొనగా దీనికి సంబంధించి గౌరవ అచ్చంపేట కోర్టు వారికి పూర్తి సాక్ష్యాధారాలతో ఫిర్యాదు చేయగా పరీశీలించిన కోర్టు ఫిర్యాదుపై తక్షణ ఎఫ్ ఐ ఆర్ నమోదు చేయమని పోలీసులకు ఆదేశాలు ఇవ్వగా బల్మూర్ పోలీస్ వారు నిందితులపై ఐపీసీ ప్రకారం 166,167,403,420,441,465,471,506, రెడ్ విత్ 34 సెక్షన్ల ప్రకారం ఎఫ్ ఐ ఆర్ నంబర్ 114/2023 తో కేసు నమోదు చేశారు అని తెలిపారు. బాధితుడు మాట్లాడుతు.. తనకు అన్యాయం పై అవినీతి కి పాల్పడిన అధికారులను వారికి సహకరించిన వారిని కఠినంగా శిక్షించి తనలాగే వీరివలన బాధింపబడిన మరెందరో బాధితులకు న్యాయం జరిగేలా న్యాయస్థానం ద్వారా పోరాడుతానని తెలిపారు.