మెగా జాబ్ మేళా విజయవంతం చేయండి

వరంగల్ ఈస్ట్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి)వరంగల్ నగరంలోని దేశాయిపేట రోడ్డు ఓయాసిస్ పబ్లిక్ స్కూల్లో ఈనెల 17న నిర్వహించే మేఘా జాబ్ మేళాను విజయవంతం చేయాలని ఎర్రబెల్లి ప్రదీప్ రావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎర్రబెల్లి వినీత్ రావు కోరారు రంగసాయిపేటలోని కాంక్ష ఫంక్షన్ హాల్ లో నిరుద్యోగులు వాళ్ళ తల్లిదండ్రులతో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు ఈ సందర్భంగా వినీత్ రావు మాట్లాడుతూ రాజకీయాలకు అతీతంగా నిరుద్యోగితను నిర్మూలించే కార్యక్రమంలో భాగంగా ఈ బృహత్తరమైన కార్యక్రమం చేపట్టినట్టు చెప్పారు దేశవ్యాప్తంగా 50 కి పైగా ఉన్న కంపెనీలలో 1000 ఉద్యోగాలకు పైగా ఇప్పించే ఒక సంకల్పంతో ఈ మేఘా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు చెప్పారు దీనిని నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు స్థానిక రిషినంద్ ట్రస్ట్ మెమోరియల్ చైర్మన్ కొల్లూరు యోగానంద్ మాట్లాడుతూ పదో తరగతి నుండి ఇంజనీరింగ్ వరకు చదువుకున్న నిరుద్యోగ యువతీ యువకులు ఈ జాబ్ మేళాకు హాజరై ఉపాధి ఉద్యోగ అవకాశాలు పొందాలని కోరారు ఈ కార్యక్రమంలో నల్లబోల విష్ణు గండ్రాతి కుమార్ పోకలఈశ్వర్ గుండు బాబురావు భక్తి రంజిత్ ఆరె కార్తీక్ తాళ్లపల్లి అర్జున్ చాపల నాగరాజు మిర్యాల రాము సత్యం గౌడ్ లక్కాకుల సతీష్ కోట అజయ్ వేల్పుగొండ శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు రంగసాయిపేట యువకులు పాల్గొన్నారు

 

తాజావార్తలు