అంగన్వాడి టీచర్లు హెల్పర్ల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు.
కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి.
మూడో రోజుకు చేరిన అంగన్వాడీల దీక్షలు.
రాజన్న సిరిసిల్ల బ్యూరో. సెప్టెంబర్ 13. (జనంసాక్షి). అంగన్వాడి టీచర్లు హెల్పర్ల సమస్యల పట్ల ప్రభుత్వానికి చిత్తశుద్ధి కరువైందని కాంగ్రెస్ పార్టీ నాయకులు కేకే మహేందర్ రెడ్డి అన్నారు. జైంట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో సిరిసిల్ల ఆర్డీవో కార్యాలయం ఎదుట జరుగుతున్న అంగన్వాడీల దీక్షలు బుధవారంమూడవ రోజుకు చేరుకున్నాయి. దీక్ష శిబిరాన్ని సందర్శించిన కాంగ్రెస్ పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కేకే మహేందర్ రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వానికి ప్రజల సమస్యల పట్ల పట్టింపు లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో ధర్నాలు ఉండవంటు ధర్నా చౌక్ ఎత్తేస్తే సమస్యలు ఉండవని తాము భావించామని అన్నారు. ప్రభుత్వనికి బెల్ట్ షాపుల మీద ఉన్న శ్రద్ధ అంగన్వాడీల సమస్యలపై లేకుండా పోయిందని మండిపడ్డారు. తక్షణమే ప్రభుత్వం అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని కోరారు. లేని పక్షంలో రానున్న ఎన్నికల్లో బిఆర్ఎస్ కు తగిన బుద్ధి చెప్పాలని కోరారు. కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు కాముని వనిత. ఎస్సీ సెల్ అధ్యక్షులు ఆకునూరి బాలరాజు, మునిగేల రాజు,భారత్, ఏఐటీయుసీ జిల్లా కార్యదర్శి కడారి రాములు జిల్లాలోని అన్ని మండలాల నుండి అంగన్వాడీ టీచర్లు హెల్పర్లు పాల్గొన్నారు.