తాండూర్ లో ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు.
సబండ వర్గాల అభివృద్ధి కోసం పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య.
జాతీయ బిసి కార్యవర్గ సభ్యులు రాజ్ కుమార్ కందుకూరి.
తాండూరు సెప్టెంబర్ 13(జనంసాక్షి)పార్లమెంట్ రాజ్యసభ సభ్యులు జాతీయ బిసి సంక్షేమ సంఘం అధ్యక్షులు ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు సందర్భంగా బుధవారం తాండూర్ పట్టణంలో బిసి బాలికల హాస్టల్ లో జాతీయ బీసీ కార్యవర్గ సభ్యులు తాండూర్ నియోజకవర్గం బీసీ సంఘం కన్వీనర్ రాజ్ కుమార్ కందుకూరి ఆధ్వర్యంలో ఆర్ కృష్ణయ్య పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థుల సమక్షంలో కేక్ కట్ చేయించి విద్యార్థులకు ఎగ్జామ్స్ ప్యాడ్ అందజేశారు ఈ సందర్భంగా రాజ్ కుమార్ మాట్లాడుతూ ఆర్ కృష్ణయ్య గత 50 సంవత్సరాల నుండి బడుగు బలహీన వర్గాల అభివృద్ధి కొరకై నిరంతరం పోరాటాలు చేస్తూ ఎన్నో విజయాలు సాధించారని దేశ చరిత్రలోనే బహుజనుల కొరకు పోరాడుతున్న ఏకైక వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని అంతటి మహోన్నతమైన వ్యక్తి పుట్టినరోజు వేడుకలు విద్యార్థుల మధ్యల జరుపుకుంటున్న అందుకు ఎంతో ఆనందంగా ఉందని ఈరోజు సంక్షేమ హాస్టల్ లు గురుకుల పాఠశాలలో సన్న బియ్యం పెట్టియడంలో ఆర్ కృష్ణ అన్న పాత్ర కీలకమని అదేవిధంగా చట్టసభల్లో 50శాతం రిజర్వేషన్లు కావాలని నిరంతరం పోరాడుతున్న వ్యక్తి ఆర్ కృష్ణయ్య అని అన్నారు వారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా యావత్ బీసీ సమాజం కోరుకుంటుంది అని అన్నారు.ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ సుందరమ్మ బీసీ మహిళా సంఘం అధ్యక్షురాలు జ్యోతి ప్రధాన కార్యదర్శి అనిత ఉపాధ్యక్షురాలు విజయలక్ష్మి బీసీ సోషల్ మీడియా ఇంచార్జ్ బసవరాజ్ బీసీ యువ నాయకులు రాము ముదిరాజ్ జుంటుపల్లి వెంకట్ సాయి తాండ్ర నరేష్ పరమేష్ మథిన్ రాజు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.