అన్నదాతలకి అందరం అండగా ఉంటామన్ని హామీ టిఎస్వై
మార్కెట్ అసోసియేషన్ అధ్యక్షుడు తలసాని శంకర్ యాదవ్,ఉన్నత శ్రేణిసెక్రెటరీఎం.వెంకన్న,చైర్ పర్సన్ రాగిరి హారిక ఇతర సభ్యులను సన్మానించిన రైతులు
సికింద్రాబాద్ ఆర్.సి జనం సాక్షి సెప్టెంబర్ 12 బోయినపల్లి మార్కెట్ యార్డ్ లో సిద్ధి బుద్ధి వినాయక ఆలయంలో రైతు భూపతి రెడ్డి,శేఖర్ రెడ్డిఆధ్వర్యంలో కేశంపల్లి, మామిడిపల్లి,రుద్రారం,చిన్నవెళ్లి,గుండారం,దేవరాపల్లి ప్రాంతాలుకు చెందిన రైతులు మార్కెట్ కమిటీ అసోసియేషన్ అధ్యక్షుడు మరియు ఇతర సభ్యులను,చైర్ పర్సన్, ఉన్న శ్రేణి సెక్రటరీ ఎం.వెంకన్న కమిటీ సభ్యులు ను రైతులు ఘనంగాసన్మానించారు.
అనంతరం రైతు భూపతి రెడ్డి స్థానికంగా రైతులు పండించే కూరగాయలు సమయంలో వాటిని మార్కెట్లో దిగుమతి చేసుకోవాలని, ట్రాఫిక్ సమస్యపై మరియు ఇతర రాష్ట్రాలు బెంగళూరు కూరగాయలను తీసుకోవద్దని రైతులు కోరారు.సమస్యలపై శంకర యాదవ్, చైర్పర్సన్, సెక్రెటరీ దృష్టికి తీసుకువచ్చారు. బోయిన పల్లి మార్కెట్లో సమస్యలతో కూడూకున్న యార్డ్ నూతనంగా కొలువు దీరిన కమిటీ కొత్త అధ్యాయానికి తెరలేపించడంతో నూటికి 90 మందికి అనుకూలంగా ఉన్న 10 శాతం మందికి మింగుటపడటం లేదు, నూతనంగా ఎన్నికైన అధ్యక్షుడు తలసాని శంకర యాదవ్ తనదైన శైలిలో రోజు ఒక వినూత్న నిర్ణయాలతో బోయినపల్లి మార్కెట్ లో అందర్నీ ఆశ్చర్యానికి గురిచేస్తున్నారు. సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్లో అందర్నీ ఇబ్బందులకు గురి చేసేఅంశం మరుగుదొడ్లు బహిర్గత భూమి పై ఈ వేళ చేవెళ్ల రైతులు ఆవేదన వ్యక్తం చేయడంతో ఒక్కసారిగా ఉలిక్కిపడ్డ సెక్రటరీ,చైర్ పర్సన్, తలసాని శంకర్ యాదవ్ అన్నదాతల మాటలు విన్న తలసాని భవిష్యత్తులో నీకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తనా పూర్తి బాధ్యత మాదే,ముఖ్యమైన విషయం ఏమిటంటే బోయిన పల్లి మార్కెట్లో గుర్తు తెలియని వాహనాలు యార్డులో అనుమతి కి సంబంధించి వాటికి మార్కెట్ గుర్తింపు గల పత్రాన్ని అందజేసి అప్పడే మార్కెట్లో కి అనుమతించడం జరుగుతుందని తద్వారా ట్రాఫిక్ అంతరాయనీ నివారించవచ్చు అన్ని తెలియజేశారు.త్వరలో బోయినపల్లి మార్కెట్లో రైతుల సౌకర్యార్థం రెండు ఫోన్ నెంబర్లు అందుబాటులో తీసుకొస్తాం,ఈ నెల చివరి కల్లా బహిర్గత భూమి (సులభ కాంప్లెక్స్ ) నిర్మాణాలుపూర్తవుతాయని అలాగే రైతన్నకు సంబంధించిన విశ్రాంతి గదులు సౌకర్యం పలు అంశాలపై చర్చించారు,రాబోయే 20 రోజుల్లో సికింద్రాబాద్ బోయినపల్లి మార్కెట్ రూప రేఖలు మార్చేస్తానంటూ తలసాని శంకర యాదవ్ వెల్లడించారు,ఈ కార్యక్రమంలోఅసోసియేషన్ కమిటీ సభ్యులు,గౌరవ అధ్యక్షుడు సోమ దేవేందర్ రెడ్డి, మార్కెట్ మార్కెట్ కమిటీ సభ్యురాలు మీనా భాస్కర్,సి.హెచ్.బాలమల్లయ్య,గంటాటిభద్రప్ప, మిరియాలశ్రీనివాస్,సిహెచ్.హనుమంతరావు,కే.శ్రీకాంత్ రెడ్డి,జనరల్ సెక్రెటరీ ఎస్.చంద్రారెడ్డి, పి.సతీష్ కుమార్, పీ.కే.కృష్ణ,ఎం.చంద్రశేఖర్ సిహెచ్ మధు, ఎం.సదానందo, డి.వేణుగోపాల్ రెడ్డి, యు.కృష్ణ, సి.హెచ్.ఐలేష్, కే.సత్యనారాయణ, కే.సి.చంద్రశేఖర్,ఇ.చంద్రమోహన్,కార్మిక విభాగ నాయకుడుసి.హెచ్.
పోచయ్య తదితరులు పాల్గొన్నారు.