తాండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గం నియామకం.
జీఓ జారీ చేసిన ప్రభుత్వం.
మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ గా గద్దె వీణా శ్రీనివాస్ చారి.
వైస్ చైర్మన్ గా ఉమాశంకర్ పటేల్.
ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి.
తాండూరు సెప్టెంబర్ 13(జనంసాక్షి)తాండూరు మార్కెట్ కమిటీ నూతన పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి సహకారంతో మార్కెట్ కమిటీ చైర్మన్ గా తాండూరు పట్టణానికి చెందిన గద్దె వీణా శ్రీనివాస్ చారి, వైస్ చైర్మన్ గా చంద్రవంచ గ్రామానికి చెందిన యువ నాయకుడు ఉమాశంకర్ పటేల్ నియామకం అయ్యారు. అదేవిధంగా మార్కెట్ కమిటీ సభ్యులు గా హరిహర గౌడ్, షేక్ కాసిం అలి, మ్యతరి ప్రకాశం, కుర్వ బీమ్మప్ప, యూ.గోపాల్ రెడ్డి, ఎండి.ముస్తఫా, గోవింద్ నాయక్, అర్పుల వెంకటప్ప, మంత్రి వెంకటయ్య, జట్టిగాల్ల శ్రీనివాస్, భాను ప్రసాద్, ప్రశాంత్ గౌడ్ నియామకం అయ్యారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. కమిటీ లో నియామకం కాబడిన సభ్యులందరు తాండూరు మార్కెట్ ను అభివృద్ధిపథంలో ముందుకు తీసుకెళ్లాలని అందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు.