ప్రజా సంక్షేమమే కాంగ్రెస్ పార్టీ ధ్యేయం: ఆవుల రాజు రెడ్డి, టిపిసిసి ప్రధాన కార్యదర్శి.
-యువజన కాంగ్రెస్ కార్యకర్తల పాదయాత్రకు స్వాగతం పలికిన రాజిరెడ్డి.
జనం సాక్షి/ కొల్చారం
కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ప్రజల సంక్షేమం కోసం చేస్తుందని టి పి సి సి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి అన్నారు. ఈనెల 17న తుక్కుగూడలో కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ రానున్న విజయభేరి వారి బహిరంగ సభకు మెదక్ నియోజకవర్గం హవేలీ ఘనపూర్ మండల యూత్ కాంగ్రెస్ అధ్యక్షులు అజీర్ పాషా ఆధ్వర్యంలో యువజన కాంగ్రెస్ కార్యకర్తలు మెదక్ పాపన్నపేట మండలాల మీదుగా తుక్కుగూడ వరకు చేపట్టిన పాదయాత్రకు ఆయన కొల్చారం మండలంలో స్వాగతం పలికారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందన్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే చేపట్టబోయే సంక్షేమ పథకాల గురించి వివరిస్తూ పాదయాత్ర చేపట్టడం హర్షించదగ్గ విషయమన్నారు తెలంగాణను ఇచ్చిన సోనియా గాంధీకి కాంగ్రెస్ పార్టీని రాష్ట్రంలో అధికారంలో తేవడం ద్వారా ప్రజలు రానున్న ఎన్నికల్లో కానుక ఇవ్వనున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల శాఖ అధ్యక్షులు మల్లేశం గౌడ్, నాయకులు గోవర్ధన్ మహేశ్వర్ రెడ్డి బాలరాజు మురళీధర్ పంతులు, లంబడి శంకర్, అగం గౌడ్, రాజు, యేసు రాజు తదితరులు పాల్గొన్నారు.