ప్రార్థించే పెదవుల కన్నా సహాయం చేసే చేతులు మిన్న..!

టీపీసీసీ ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి

జనం సాక్షి/ కొల్చారం మండలంలోని వరిగుంతం గ్రామంలో పునర్నిర్మాణం చేస్తున్న ఆంజనేయస్వామి దేవాలయాన్ని మంగళవారం సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అలాగే దేవాలయ నిర్మాణానికి గతంలో ఇచ్చిన 51 వేల రూపాయలకు తోడు మరికొంత ఆర్థిక సహాయాన్ని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులకు మంగళవారం అందజేశారు. ఈ సందర్భంగా ఆవుల రాజిరెడ్డిని ఆలయ నిర్మాణ కమిటీ సభ్యులు కమ్మరి పాండరి, వడ్ల శ్రీనివాస్, చిన్నారం ప్రభాకర్ శాలువాలు కప్పి సన్మానించారు. ఈ సందర్భంగా టిపిసిసి ప్రధాన కార్యదర్శి ఆవుల రాజిరెడ్డి మాట్లాడుతూ వరిగుంతం గ్రామం పాడిపంటలతో అష్ట ఐశ్వర్యాలతో వర్ధిల్లాలి అన్నారు. అలాగే వరిగుంతం, తాండ, కొల్చారం గ్రామాలలో వివిధ కారణాలతో మృతి చెందిన పలు కుటుంబాలకు చెందిన వారిని పరామర్శించి ఆర్థిక సహాయన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నాగుల గారి మల్లేష్ గౌడ్, స్టేట్ ఓబీసీ సెల్ రాష్ట్ర నాయకులు మురళీధర్ పంతులు, మండల వైస్ ప్రెసిడెంట్ గోవర్ధన్, ప్రధాన కార్యదర్శి మహేశ్వర్ రెడ్డి, మండల మైనార్టీ సెల్ అధ్యక్షుడు అక్రమ్, బీసీ సెల్ మండల ప్రధాన కార్యదర్శి అక్కంగారి రవీందర్ గౌడ్, అల్తప్,అప్పు,కొప్పుల యేసు రాజు, జోగిపేట విటల్ గౌడ్, ఉపేందర్ గౌడ్, చింతల బాలరాజ్, లంబాడి శంకర్ నాయక్, తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు