ఆయిల్ ఇంజన్ ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని దుండగులు
అశ్వారావుపేట, సెప్టెంబర్ 13( జనం సాక్షి ) బిఎస్ పార్టీ నాయకుడు బొల్లు కొండ చెన్నారావుకు చెందిన ఆయిల్ ఇంజన్ ను కొందరు గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసిన సంఘటన తిరుమల కుంటలో జరిగింది. ముత్యాలమ్మ చెరువుకి దగ్గరలో ఉన్న పొలంలో టిఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షుడు బొల్లు కొండ చెన్నారావు చెందిన పొలంలో వేరుశనగ పోసి వ్యవసాయం సాగిస్తున్నారు. చెరువు కాలవలో ఇంజన్ తో నీటి తడులు పెట్టి ఉండగా మంగళవారం రాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆయిల్ ఇంజన్ చేసి నీటి కాలవలో పడేశారు. ఎప్పటిలాగే చేన్లోకి వెళ్లిన బొల్లి కొండ చెన్నారావు దుండగులు ధ్వంసం చేసిన ఇంజన్ నుచూసాడు. ఊర్లోకి వచ్చి మీడియాకి చెప్పుకున్నారు. బి ఆర్ ఎస్ పార్టీ గ్రామ శాఖలో అధ్యక్షుడిగా పనిచేస్తూ చురుకైన కార్యకర్తగా ముద్ర ఉంది. రాజకీయంగా ఏమైనా దెబ్బ తీసే విధంగా ఇటువంటి కార్యక్రమాలకు అపోజిషన్ పార్టీ దాడులకు దిగుతున్నట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నట్లు తెలిసింది