మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హోమియోపతి ఆధ్వర్యంలోమెడికల్ క్యాంప్

మల్దకల్ సెప్టెంబర్ 13 (జనం సాక్షి)ప్రభుత్వ జూనియర్ కళాశాల మల్దకల్ ఎన్ఎస్ఎస్ యూనిట్ల ఆధ్వర్యంలో కళాశాల విద్యార్థిని విద్యార్థులకు మల్దకల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం హోమియోపతి డాక్టర్లచే మెగా మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా వారు విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలు నిర్వహించి ఆరోగ్యం సరిగా లేని విద్యార్థులకు మందులు మెడికల్ పరీక్షలు నిర్వహించారు.హోమియోపతి డాక్టర్ జయమ్మ మాట్లాడుతూ విద్యార్థులు ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకునే విధంగా సూచనలు సలహాలు చేయడం జరిగింది.కళాశాల ప్రిన్సిపాల్ ఎం రమేష్ లింగం మాట్లాడుతూ విద్యార్థులు తగిన పౌష్టిక ఆహారం తో కూడిన భోజనం తగు సమయానికి తీసుకుంటూ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్లు రామాంజనేయులు గౌడ్, నరసింహులు,ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సిబ్బంది కళాశాల అధ్యాపక బృందం పాల్గొన్నారు.

తాజావార్తలు