తాండూరు మార్కెట్ కమిటీ పాలకవర్గంలో డైరెక్టర్ గా మంత్రి వెంకటయ్య.

తాండూరు సెప్టెంబర్ 13 (జనం సాక్షి) వికారాబాద్ జిల్లా తాండూర్ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని నిర్ణయించారు. ఇందులో భాగంగానే యాలాల మండలం దేవనూరు గ్రామానికి చెందిన మంత్రి వెంకటయ్య కు మార్కెట్ కమిటీ పాలకవర్గంలో డైరెక్టర్ గా స్థానం లభించింది. మంగళవారం ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి అధికారికంగా తాండూర్ వ్యవసాయ మార్కెట్ కమిటీ పాలకవర్గాన్ని ప్రకటించారు.దీంతో తోటి మిత్రులు కుటుంబ సభ్యులు పాలకవర్గ సభ్యులు శుభాకాంక్షలు తెలిపారు. దేవనూర్ గ్రామానికి చెందిన మంత్రి వెంకటయ్యకు మార్కెట్ కమిటీ లో డైరెక్టర్ గా అవకాశం లభించడం పట్ల హర్షం వ్యక్తం చేశారు.
ఇంకా మరెన్నో ఉత్తమ పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు త్వరలోనే మార్కెట్ కమిటీ పాలకవర్గానికి ప్రమాణస్వీకారం నిర్వహిస్తున్నట్లు సమాచారం.

తాజావార్తలు