జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించాలని ఎంఈఓకు వినతి
-వినతిపత్రాన్ని అందజేసిన ఐజేయు నాయకులు
మహబూబాబాద్ బ్యూరో-సెప్టెంబర్13(జనంసాక్షి)జర్నలిస్టుల పిల్లలకు ఫీజు రాయితీ కల్పించేందుకు జిల్లా కలెక్టర్, విద్యాశాఖాధికారి ఆదేశాలు జారీ చేసినప్పటికీ ఆ ఆదేశాలను కొన్ని ప్రైవేటు పాఠశాలలు తుంగలో తొక్కుతూ జర్నలిస్టుల పిల్లలను పాఠశాలలనుండి బైటికి పంపిస్తున్న విషయాన్ని టియుడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా సహాయ కార్యదర్శి రావూరి ప్రశాంత్(జనంసాక్షి మహబూబాబాద్ జిల్లా బ్యూరో చీఫ్), ఎలక్ట్రానిక్ విభాగం కోశాధికారి గండి సీతారాం(సాక్షి టివి), జిల్లా కౌన్సిల్ సభ్యులు తోడేటి రాము(మనం ప్రతినిధి), గార్ల మండల కేంద్రంలో ఎంఈఓ పుల్చంద్ కు వినతిపత్రం అందజేసి విషయాన్ని ఆయన దృష్టికి తీసుకువెల్లగా సానుకూలంగా స్పందించిన ఎంఈఓ సంబంధిత పాఠశాలలకు చరవాని ద్వారా సంప్రదించి కలెక్టర్, జిల్లా వైద్యాధికారి ఆదేశాలను పాటించాలని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఐజేయు మండల కమిటీ సభ్యులు రూపన్ శంకర్(జ్యోతి), కున్నమళ్ల కృష్ణ(సూర్య) తదితరులు పాల్గొన్నారు.