ఎమ్మెల్యే ని సన్మానించిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు
గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి);ఎమ్మెల్యే కి సుప్రీంకోర్టులో స్టే వచ్చిన సందర్భంగా బుదవారం గద్వాల జిల్లా కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి కి మర్యాదపూర్వకంగా కలిసిన బిఆర్ఎస్ పార్టీ నాయకులు సురేష్ శెట్టి, ఎల్ఐసి అల్లపాడు వెంకటేశ్వర్ శెట్టి శాలువ కప్పి పుష్పగుచ్చం ఇచ్చి ఘనంగా హార్దిక శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ ఛైర్మన్ జంబు రామన్ గౌడ,ఎంపీపి విజయ్, పి ఏ సి యస్ ఛైర్మన్ తిమ్మారెడ్డి, మండలం రైతు బంధు సమితి అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు నాగర్ దొడ్డి వెంకట రాములు, సీతారాం రెడ్డి, శేఖర్, సురేష్ శెట్టి,నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.