జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా సోషల్ రెస్పాన్సిబిలిటీ కి నిక్షయ మిత్ర సర్టిఫికెట్

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి);మినిస్టరీ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా జారీచేసిన నిక్షయ మిత్ర సర్టిఫికెట్ ను బుధవారం జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి సోషల్ రెస్పాన్సిబిలిటీ టీంకు అందజేశారు.కొద్దినెలల క్రితం టిబి పేషెంట్స్ 20 మందిని అడ్డప్ట్ చేసుకొని పౌష్ఠిక ఆహారం 20 మందికి ఆరు నెలలకు సరిపడ సరుకులను పంపిణీ చేసినందుకు మినిస్టర్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా తరఫున నిక్షయ మిత్ర ప్రధానమంత్రి టీబి ముకేట్ భారత్ అభియాన్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ టీబి వారి నుండి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి టీమ్ కు అప్రిసియేషన్ సర్టిఫికేట్ ను సోషల్ రెస్పాన్సిబిలిటీ టీంకు అందజేసినట్లు టీం సభ్యులు సంధ్య అశోక్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు, మహేష్,నాగేష్,పరమేష్, మురళి,నాగరాజు,రాజశేఖర్, పరుశ రాముడు, బెంజమిన్ తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు