డిగ్రీలో చేరాలనుకునే వారికి చివరిఅవకాశం.
-అంబేద్కర్ స్టడి సెంటర్ సమన్వయకర్త వర్కాల శ్రీనివాసులు.
నాగర్ కర్నూల్ బ్యూరో, జనంసాక్షి:డిగ్రీ కోర్సుల్లో అడ్మిషన్లకు చివరి అవకాశంగా మరోసారి అంబేద్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం గడువు పోడిగించింది, ఇంటర్ లేదా ఐటిఐ లేదా ఎదేని రేండేళ్ళ డిప్లోమా కోర్సు పూర్తిచేసిన వారు డిగ్రీ అడ్మిషన్ పోందుటకు సెప్టెంబర్ 30 వరకు గడువు పోడగించబడిందని నాగర్ కర్నూల్ అంబేద్కర్ స్టడి సెంటర్ సమన్వయకర్త వర్కాల శ్రీనివాసులు తెలిపారు,ఇట్టి అవకాశం ను యువతీ యువకులు గృహిణులు ప్రభుత్వ ప్రైవేట్ ఉద్యోగస్తులు సద్వినియోగం చేసుకుని ఇంటినుండే చదివి డిగ్రీ విద్యను పూర్తిచేయవచ్చని అన్నారు. ప్రస్తుత కాలంలో డిగ్రీ విద్య చాలా అవసరం అని అంబేద్కర్ సార్వత్రిక విద్య రెగ్యూలర్ డిగ్రీ విద్యతో సమానమని తెలిపారు, మరింత సమాచారం కోసం 7382929779 నంబర్ ను సంప్రదించాలని తెలిపారు.