గణేష్ విగ్రహ నిర్వాహకులు మండపం ఏర్పాటుకు తప్పని సరిగా పోలీస్ పోర్టల్ ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవలెను-జిల్లా ఎస్పీ కె. సృజన.

గద్వాల నడిగడ్డ, సెప్టెంబర్ 13 (జనం సాక్షి):సంస్కృతి, సాంప్రదాయాలకు నిలయమైన పండుగలను ప్రశాంతంగా నిర్వహించుకునే కలిసికట్టుతనం జోగులాంబ గద్వాల జిల్లా ప్రజల సొంతమని, రానున్న వినాయక చవితి ఉత్సవాలను నిర్విఘ్నంగా జరుపుకోవడంలో ఉత్సవ కమిటీలు, యువజన సంఘాలు పోలీసులకు సహకరించాలని జిల్లా ఎస్పీ కె. సృజన ప్రజలకు సూచించారు.రాబోయే వినాయక చవితి సందర్బంగా మండపాల నిర్వాహకులు పాటించాల్సిన నియమనిబందనల పై జిల్లా ఎస్పీ ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సంవత్సరం వినాయక చవితి ఈ నెల 18 నుండి విగ్రహల స్థాపనతో ప్రారంభమై ఈ నెల 28 న తుది నిమజ్జనం తో ముగుస్తుందనీ,పండగను జరుపుకొను సందర్బంగా సమస్త ప్రజల శాంతి భద్రతలు, ప్రజల క్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని వినాయకుని విగ్రహ మండప నిర్వాహకులు అందరూ కూడా తమ తమ వినాయక మండలి కార్యనిర్వాహక బృందం యొక్క వివరములు కింద తెలుపబడిన website లింక్ ను ఉపయోగించి ఆన్లైన్ లో నమోదు చేసుకోవాలని తెలియజేశారు.https://policeportal.tspolice.gov.in/index.htm ఇట్టి ఆన్లైన్ నందు నమోదు ప్రక్రియను ఈ నెల 18 లోపు పూర్తి చేసుకోవలెనని సూచించారు.
ఈ విషయం లో జిల్లా లోని అన్నీపోలీస్ స్టేషన్ ల సిబ్బంది ఆన్లైన్ నమోదు ప్రక్రియలో మీకు సహకరించు విధముగా అన్నీ ఏర్పాట్లు చేయబడినవి అని, మీరు తమ తమ పరిదిలో ని పోలీస్ స్టేషన్ సిబ్బంది యొక్క సహాయ సహకారాల తో మీ యొక్క వినాయక మండలి కార్యనిర్వాహక బృందం యొక్క వివరాలను త్వరితగతిన పూర్తి చేసుకోవాలని జిల్లా ఎస్పీ సూచించారు.

తాజావార్తలు