అమ్మలకు ప్రతిరూపాలే అంగన్వాడీలు-వనపర్తి నియోజకవర్గ కాంగ్రెస్ నాయకులుతూడి మేఘారెడ్డి

వనపర్తి బ్యూరో సెప్టెంబర్13 (జనం సాక్షి)గ్రామాలలో అంగన్వాడీ టీచర్లుగా పనిచేసే ప్రతి ఒక్కరూ అమ్మలకు ప్రతిరూపాలని అలాంటి అంగన్వాడి కార్యకర్తలను సైతం ఇబ్బందులకు గురిచేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పే రోజు త్వరలోనే వస్తుందని వనపర్తి నియోజకవర్గం కాంగ్రెస్ నాయకులు తూడి మేఘారెడ్డి గారు అన్నారు.
బుధవారం వనపర్తి జిల్లా కేంద్రంలో దాదాపు 1000 మంది అంగన్వాడీ కార్యకర్తలు చేపట్టిన నిరసన దీక్షకు ఆయన మద్దతు ప్రకటించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అన్ని ప్రభుత్వ కార్యక్రమాల్లో అంగన్వాడీలతో పని చేయించుకుంటూ… ఉద్యమ సమయంలో వారు చేపట్టిన ఉద్యమ ఫలితంగా, కరోనా సమయంలో వారు చేసిన సేవ ఫలితంగా ఎంతో మంది బ్రతికి బట్ట కట్టా గలిగారని అలాంటి అంగన్వాడీలపై కూడా రాష్ట్ర ప్రభుత్వం చిన్న చూపు చూడడం భావ్యం కాదని ఆయన అన్నారు.ప్రభుత్వం వెంటనే వారి వేతనాలను 26 వేలకు పెంచాలని అదేవిధంగా పదవీ విరమణ పొందే ప్రతి అంగన్వాడి టీచర్ కు 5లక్షల రూపాయలను అందించాలని ఆయన డిమాండ్ చేశారు.అంగన్వాడీల డిమాండ్ల కోసం తాను ఎంతవరకైనా వస్తానని వారికి ఎల్లవేళలా అండదండగా ఉంటానని ఆయన వారికి భరోసా కల్పించారు.అంగన్వాడి టీచర్లు వారి సమస్యల పరిష్కారానికి ధర్నా నిర్వహించే సమయంలో ప్రభుత్వ అధికారులు దౌర్జన్యంగా వారి అంగన్వాడి కేంద్రాలకు ఉన్న తాళాలను పగులగొట్టి అంగన్వాడి కేంద్రాలు నడుస్తున్నాయి అన్నట్లు ప్రభుత్వానికి చూపడం తెలంగాణ ప్రభుత్వ అరాచక పాలన నిదర్శనమని పేర్కొన్నారు.అంగన్వాడి కేంద్రాల తాళాలను పగలగొట్టి అధికారులపై ప్రతి కార్యకర్త తరపున న్యాయస్థానాల సైతం ఆశ్రయిస్తామని ఆయన అన్నారు కార్యక్రమంలోవనపర్తి మాజీ ఎంపీపీ శంకర్ నాయక్, పెద్దమందడి సర్పంచ్ వెంకటస్వామి, కౌన్సిలర్లు రాధాకృష్ణ వెంకటేష్ బ్రహ్మం చారి, కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు తదితరులు పాల్గొన్నారు.

తాజావార్తలు